ఎంతో రుచికరమైన నోరూరించే బియ్యం పిండి బిస్కెట్లు ఎలా చెయ్యాలో తెలుసా?

First Published Jan 6, 2022, 4:21 PM IST

పిల్లలు ఇంటిలో రొటీన్ గా చేసే స్నాక్ ఐటమ్స్ (Snack Items) ను తినడానికి పెద్దగా ఇష్టపడరు. వీరికి వెరైటీ స్నాక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలామంది పిల్లలకు బిస్కెట్లు అంటే ఇష్టం ఉంటుంది. అయితే బిస్కెట్లు ఇంట్లోనే హెల్తీగా బియ్యప్పిండితో తయారుచేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే బియ్యప్పిండి బిస్కెట్లు (Rice flour biscuits) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

బిస్కెట్లను బయటినుంచి తెచ్చుకునే బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్ లో మైదాతో (Maida) తయారుచేసిన బిస్కెట్లు ఎక్కువగా దొరుకుతాయి. మైదా బిస్కెట్లు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఇంట్లోనే సులభంగా తక్కువ పదార్థాలతో తయారుచేసుకునే బియ్యప్పిండి బిస్కెట్లు చాలా రుచిగా (Delicious) కూడా ఉంటాయి.
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యప్పిండి (Rice flour), సగం కప్పు చక్కెర (Sugar), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), చిటికెడు యాలకుల పొడి (Cardamom powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), చిటికెడు వంట సోడా (Baking soda), తగినన్ని నీళ్లు (Water), తగినంత నూనె (Oil).
 

తయారీ విధానం: ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి, చిటికెడు (Pinch) యాలకుల పొడి, రుచికి (Taste) సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి.
 

ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee) వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నెయ్యిని బియ్యప్పిండి మిశ్రమంలో (Rice flour mixture) వేసి కలుపుకోవాలి.
 

ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు, చక్కెర వేసి కరిగించాలి. చక్కెర కరిగిన తరువాత ఈ నీటిని  బియ్యప్పిండిలో వేసి కలుపుకోవాలి. పిండిలో  కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా చపాతీపిండిలా (Like chapati) బాగా కలుపుకోవాలి (Mix well).
 

ఇలా కలుపుకున్న పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు పిండి నానితే బిస్కెట్లు (Biscuits) బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) వేసి వేడి చేసుకోవాలి.
 

ఆయిల్ వేడెక్కే లోపు నానబెట్టుకున్న పిండిని తీసుకుని చపాతీలాగ మందంగా (Thick) చేసుకోవాలి. దీని అంచులను చాకుతో తీసేసి పిల్లలకు నచ్చిన ఇష్టమైన ఆకారంలో (Shape) కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న బిస్కెట్ లను కాగుతున్న ఆయిల్ లో వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

అంతే ఎంతో రుచికరమైన నోరూరించే బియ్యప్పిండి బిస్కెట్లు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిస్కెట్లను ఒకసారి ట్రై చేయండి. ఇలా వెరైటీ (Variety) స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసి మీ పిల్లలకు ఇస్తే వారు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడుతారు.

click me!