ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లగా ఎందుకు మారుతుందో తెలుసా?

First Published Jan 6, 2022, 2:59 PM IST

మహిళలకు గర్భం దాల్చడం అనేది ఒక అద్భుతమైన వరం లాంటిది. అమ్మా అయ్యే తరుణంలో ఆ మధురమైన క్షణాలను కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచిస్తూ వారి చర్మ సంరక్షణను పక్కన పెట్టేస్తున్నారు. దాంతో వారిలో అనేక చర్మ సమస్యలు (Skin problems) ఏర్పడతాయి. ఈ చర్మ సమస్యలకు దూరంగా ఉండడానికి వారు కొన్ని జాగ్రత్తలు (Precautions) తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గర్భధారణ సమయంలో మహిళలలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా మెడ నల్లబడడం, ఎద భాగాల దగ్గర నల్లగా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గర్భధారణ సమయంలో చర్మం సాగుతుంది (Skin stretches). దీంతో పొడిబారిపోతుంది. కాబట్టి చర్మానికి తేమను అందించడానికి ప్రతిరోజు మాయిశ్చరైజింగ్ (Moisturizing) లను అప్లై చేసుకోవాలి.
 

ప్రెగ్నెన్సీ నాలుగో నెలలో మెడ పొత్తికడుపు తొడలపై  స్ట్రెచ్ మార్క్స్ (Stretch marks), ముఖంపై పిగ్మెంటేషన్ (Pigmentation) వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. మీ చర్మ సమస్యలు ప్రసవానంతరం కూడా కనిపిస్తాయి. కనుక ఈ సమస్యలను తగ్గించుకోవడానికి గర్భం దాల్చిన సమయం నుంచే చర్మ సంరక్షణకు (Skin care) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి.
 

కొందరిలో ప్రసవం తర్వాత చాలా రోజులకు ఈ చర్మ సమస్యలు తగ్గిపోతాయి. మరికొందరిలో మీ చర్మ సమస్యలు శాశ్వతంగా ఉండిపోతాయి. కనుక ముందుగానే కొబ్బరి నూనెతో (Coconut oil) చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుంటే  ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ సమస్యలు రావడానికి మరికొందరిలో హార్మోన్ల సమస్య (Hormonal problem) కావచ్చు కనుక డాక్టర్ లను సంప్రదించడం మంచిది.
 

ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కనుక చర్మ సంరక్షణ (Skin care) కోసం ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) గాఢత తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. బ్యూటీ ప్రొడక్ట్ ఎంపిక విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ముఖానికి, ఒంటికి రసాయనాలు లేని ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.
 

చర్మానికి కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో (Almond oil) సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇవి చర్మానికి సహజసిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్ గా సాయపడతాయి. వీటితో చర్మానికి ఎటువంటి హాని కలగదు. చర్మ సమస్యలకు మరో ముఖ్య కారణం నీరు (Water) తక్కువగా తాగడం.
 

గర్భధారణ సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణకు కూడా మంచిది. కనుక ఎనిమిది గ్లాసులు నీటిని తాగడం అలవరచుకుంటే చర్మం డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడకుండా తాజాగా ఉంటుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్టెచ్ మార్కులను తగ్గించుకోవడానికి విటమిన్ ఈ (Vitamin E) ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

హార్మోనుల సమతుల్యతను తగ్గించుకోవడానికి తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పోలిక్ యాసిడ్ (Folic acid), విటమిన్ సి  (Vitamin C) సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పండ్లు, బ్రోకలీ, సిట్రస్ ఫలాలు, బీన్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఇవి కాబోయే అమ్మకు, బిడ్డకు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు వారి చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

click me!