శరీరానికి చలువను అందించే కొబ్బరి పెరుగు కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Published : Apr 20, 2022, 04:34 PM IST

అధిక ఎండల తీవ్రత కారణంగా శరీరం డీహైడ్రేషన్ (Dehydration) బారినపడకుండా ఉండాలంటే మనం రోజూ చేసుకునే వంటల పట్ల కూడా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.  

PREV
16
శరీరానికి చలువను అందించే కొబ్బరి పెరుగు కూర..  ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

అందుకే శరీరానికి చలువను అందించే ఆహార పదార్థాలను వండుకోవడం మంచిది. అందుకే మనం పెరుగుతో చేసుకునే వంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు మనం పెరుగుతో కొబ్బరి కూరను (Coconut curry with yogurt) ఎలా వండాలో తెలుసుకుందాం..
 

26

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల కొబ్బరి తురుము (Coconut grater), మూడు కప్పుల పెరుగు (Yogurt), రుచికి సరిపడ ఉప్పు (Salt), మూడు టేబుల్ స్పూన్ ల జీలకర్ర (Cumin), మూడు పచ్చిమిరపకాయలు (Chilies), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies),  కొన్ని కరివేపాకులు (Curries), ఒక టేబుల్ స్పూన్ నెయ్యి (Ghee), కొద్దిగా కొత్తిమీర (Coriyander) తరుగు, ఒక కప్పు నీళ్లు (Water).
 

36

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ల జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, ముందుగా దోరగా వేయించుకున్న జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు, నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి (Scramble).
 

46

తరువాత ఇప్పుడు ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు పెరుగు గిన్నెను స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తక్కువ మంట (Low flame) మీద మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పెరుగు మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్లీ కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
 

56

నెయ్యి వేడెక్కాక ఎండుమిరపకాయలు, కరివేపాకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అలాగే చివరిలో కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి పెరుగు కూర (Coconut yogurt curry) రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్తీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి.
 

66

మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది. ఇలా వేసవికాలంలో పెరుగుతో చేసుకునే వంటలను తీసుకుంటే శరీర వేడి తగ్గి శరీరానికి చలువ అందుతుంది. దీంతో డిహైడ్రేషన్, వడదెబ్బ (Sunstroke) వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి (Immunity) పెరిగి అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇలా పెరుగుతో కొత్త రుచులను ట్రై చేయండి.. కుటుంబ సభ్యులతో కలిసి రుచులను ఆస్వాదించండి..

click me!

Recommended Stories