మంచి ఆరోగ్యం కోసం ఉదయాన్నే వీటిని తీసుకుంటే ఊహించని లాభాలు.. ఏంటో తెలుసా?

First Published Oct 24, 2021, 7:18 AM IST

మారే కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. బయట దొరికే జంక్ ఫుడ్ (Junk food) ల వాడకం పెరగడంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. 

మారే కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. బయట దొరికే జంక్ ఫుడ్ (Junk food) ల వాడకం పెరగడంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. దీనికి కారణం ఆహారపు అలవాట్లలో మార్పు. ఆరోగ్యానికి మితాహారం (Abstinence) తీసుకోవడం మంచిది. 
 

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు (Nutrients) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఉదయం (Morning) పూట ఏ ఆహార అలవాట్లను ఆచరిస్తే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

నట్స్: నట్స్ (Nuts) తీసుకొనుట వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రోటీన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. నట్స్ లో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. పిత్తాశయంలో రాళ్ళు (Stones) ఏర్పడవు.
 

కాన్సర్: క్యాన్సర్లు (Cancer) వచ్చే లక్షణాలు తక్కువ. నరాల సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. డయాబెటిస్ ను నియంత్రిస్తాయి. చర్మ (skin) ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి.

పండ్లు: పండ్లు (Fruits) ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తేలికగా జీర్ణం (Digestion) అవుతాయి. వీటిలో విటమిన్స్, పొటాషియం, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కడుపులో మంట, గ్యాస్, పుల్లటి తేపులు, అరుగుదల సరిగా లేకపోవడం, అజీర్తి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.  
 

గ్రీన్ టీ: గ్రీన్ టీ (Green tea) ఆరోగ్యానికి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇది పంటి నొప్పిని తగ్గిస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె పోటు సమస్యలను నియంత్రిస్తుంది. పంచదార (Sugar) కలిపిన టీ కంటే గ్రీన్ టీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
 

ప్రోటీన్ షేక్స్: ప్రోటీన్ షేక్స్(Protien shakes) శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. రకరకాల ప్రోటీన్ షేక్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో సోయా ప్రోటీన్ షేక్ యాంటీ ఆక్సిడెంట్స్ లను కలిగి ఉంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీర బరువును (Weight) నియంత్రిస్తుంది. ఎముకలకు కావలసిన క్యాల్షియాన్ని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

click me!