Diabetes: ఈ రసం తీసుకుంటే 3 గంటల్లోనే చక్కెర స్థాయిలు తగ్గుముఖం.. తాజా అధ్యయనంలో వెల్లడి..

First Published Dec 5, 2021, 12:15 PM IST

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం/డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారత్‌లో కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. 

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం/డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారత్‌లో కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. 

అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారం అలవాట్లలో మార్పులు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలియకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఆధారంగా వర్గీకరించబడిన టైప్-2 మధుమేహం సకాలంలో గుర్తించి, దాని నియంత్రణ చర్యలు చేపట్టకపోతే ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

డయాబెటిస్‌ను నియంత్రించడానికి, బారిన పడకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, కాంప్లెక్స్ పిండి పదార్ధాలు అధికంగా ఉండే చక్కెర లేని, తక్కువ కార్బోహైడ్రేట్ల ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. 

అయితే కొన్ని రకాల పండ్లు శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయనే సంగతి తెలిసిందే. తక్కువ, చెక్కర లేని ఆహారం విషయానికి వస్తే కొన్ని పండ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే చాలా పండ్లలో పోషకాలు సమృద్దిగా ఉన్నప్పటికీ ఫ్రక్టోజ్, సహజంగా లభించే చెక్కరలు ఎక్కువగా ఉండటం.. రక్తంలోని చెక్కర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. 

అందుకే అధిక చెక్కర, తక్కువ ఫైబర్ కారణంగా నిపుణులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు పండ్ల రసాలు సిఫారసు చేయరు. ఎందుకంటే ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను త్వరగా పెంచగలవు. అయితే తాజాగా ఓ అధ్యయయం.. ఓ నిర్దిష్ట పండ్ల రసం రక్తంలో చెక్కరను కొన్ని నిమిషాల్లోనే తగ్గిస్తుందని తేల్చింది. 
 

అదేమిటంటే..?
ఎల్సెవియర్ జర్నల్‌లో (journal Elsevier) ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మధుమేహం ఉన్నవారిలో రక్తంలోని చెక్కర స్థాయిలపై దానిమ్మ రసం (pomegranate juice) స్వల్పకాలిక ప్రభావలను అన్వేషించారు. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరపై రసం ప్రభావాన్ని.. అది తీసుకున్న మూడు గంటల తర్వాత నిపుణులు అంచనా వేశారు. ఇందుకోసం మధుమేహం ఉన్న 85 మందిని పరీక్షించారు. 12 గంటల ఉపవాసం తర్వాత వారిలో రక్త నమునాలను, ఆ తర్వాత దానిమ్మ రసం(ఒక కిలోగ్రాము శరీర బరువుకు 1.5 మి.లీ చొప్పున) తీసుకున్న ఒక గంట తర్వాత, మూడు గంటల తర్వాత రక్త నమునాలను సేకరించి పరీక్షించారు. 

ఫలితాలలో రక్తంలో చెక్కర స్థాయిలలో తగ్గుదలని గుర్తించినట్టుగా పరిశోధకకులు తెలిపారు. టైప్-2 డయాబెటిస్ రోగులలో రసం తీసుకున్న మూడు గంటల తర్వాత ఇన్సులిన్ నిరోధకతను ప్రదర్శించినట్టుగా చెప్పారు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న రోగులలో ప్రభావం మరింత శక్తివంతంగా ఉందని వెల్లడించారు. ఫలితాలు పురుషులు, మహిళలు ఇద్దరిలో సమానంగా ఉన్నప్పటికీ.. వృద్ధ రోగులలో ఇది తక్కువ ప్రభావవంతంగా ఉందని పేర్కొన్నారు. 

click me!