సేమియా పులావ్ ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

First Published Dec 5, 2021, 12:08 PM IST

 సేమియా అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పాయసం. సేమియాతో మనం ఎప్పుడూ పాయసం, ఉప్మా ట్రై చేసి ఉంటాం. ఇలా ఎప్పుడూ చేసుకునే వాటిని పక్కన పెట్టేసి ఈసారి కొత్తగా సేమ్యా పులావ్ ను ట్రై చేయండి. ఇలా కొత్తగా వెరైటీగా చేసుకునే రెసిపీ లను పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఈ రెసిపీ మీ పిల్లలకు చాలా నచ్చుతుంది. దీని తయారీ విధానం కూడా చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా సేమియా పులావ్ (Semiya pulav) ఎలా చేయాలో తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా (Semiya), పావు కప్పు పచ్చి బఠాణీలు (Green peas), క్యారెట్ (Carrot) ఒకటి, రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు (Ginger garlic paste), బిర్యానీ ఆకు ఒకటి (Bay leaf),  రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), చిటికెడు పసుపు (Turmeric), టమోటా (Tomato) ఒకటి, సగం క్యాప్సికం (Capsicum), రెండు లవంగాలు (Cloves), పది జీడిపప్పులు (Cashews), కొంచెం చెక్క (Cinnamon), మూడు యాలకులు (Cardamom), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), రెండు పచ్చిమిరపకాయలు (Green chillies), ఒక ఉల్లిపాయ (Onion), ఒక స్పూన్ నిమ్మ రసం (Lemon juice), కొత్తిమీర (Coriyander) తరుగు, పుదీనా (Mint) తరుగు, పోపుకు సరిపడా ఆయిల్ (Oil). 
 

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి (Ghee) వేడెక్కిన తరువాత  ఇందులో ఒక కప్పు సేమియా వేసి రోస్ట్ (Roast) చేసుకోవాలి. సేమియా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
 

ఇప్పుడు అదే కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన (Heated oil) తర్వాత అందులో లవంగాలు, చెక్క, యాలకులు, జీడిపప్పు, బిర్యాని ఆకు, జీలకర్ర వేసి ఫ్రై (Fry) వేయించుకోవాలి.
 

ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ (Onion), పొడవుగా కట్ చేసిన పచ్చి మిరపకాయలు (Green chillies) వేసి వేయించుకోవాలి. పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

ఇప్పుడు ఇందులో బఠాణీలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, పసుపు (Turmeric) వేసి కలుపుకొని ఐదు నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించాలి. 
 

ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమ్యాకు రెండు కప్పుల నీళ్లు (Water) పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు సేమియా (Semiya) వేసి కలుపుకోవాలి. సేమియా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కలుపుకోవాలి.
 

స్టవ్ ఆఫ్ చేసే ముందర నిమ్మరసం వేసి ఒక నిమిషం తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ సేమ్యాను ప్లేట్ లో తీసుకుని సర్వ్ (Serve) చేయండి. అంతే ఎంతో రుచికరమైన సేమియా పులావ్ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

click me!