పాదాల పగుళ్లు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయా అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి!

First Published Dec 5, 2021, 11:21 AM IST

వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి పాదాల పగుళ్లు (Cracked heels) చాలా ఇబ్బందిని కలిగిస్తుంటాయి. పాదాల పగుళ్లు ఏర్పడినప్పుడు ఎర్రగా కమిలి అందవిహీనంగా కనిపిస్తాయి. పాదాల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. ఆరోగ్యానికి ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామో అదే విధంగా పాద సంరక్షణకు (Foot care) కూడా తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అప్పుడే మన పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పాదాల పగుళ్ళు ఏర్పడినప్పుడు తీసుకోవలసిన ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం..
 

మన పాదాలు కూడా శరీరంలో ఒక భాగం. అలాంటప్పుడు వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం (Neglected) చేయరాదు. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనుల్లో నిమగ్నమై పాదాల సౌందర్యాన్ని పట్టించుకోరు. పాదాలు అందవిహీనంగా (Unattractive) ఉన్నప్పుడు వారికి ఇష్టమైన షార్ట్ లెన్త్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇబ్బంది పడతారు.
 

చలికాలంలో (Winter season) పాదాల పగుళ్లు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. పాదాల పగుళ్లు తగ్గించుకోవడానికి నిత్యం కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఇలాంటి సమస్య నుంచి విముక్తి పొందడానికి మందుల వాడకాన్ని తగ్గించి ఇంటి చిట్కాలను ట్రై చేస్తే మంచి ఫలితం (Good result) ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

నువ్వుల నూనె: పాదాలను మృదువుగా తయారవ్వడానికి నువ్వుల నూనె (Sesame oil) చక్కగా పనిచేస్తుంది. పాదాల సంరక్షణ కోసం గోరువెచ్చని నువ్వులనూనె ను రాత్రి పడుకునే ముందు పాదాలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి (Decrease).
 

రోజ్ వాటర్, గ్లిజరిన్: ఒక కప్పులో రోజ్ వాటర్ (Rose water), గ్లిజరిన్ (Glycerin) సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్ల మీద అప్లై చేసుకోవాలి. గంట తర్వాత పాదాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

గోరువెచ్చని నీరు, నిమ్మరసం: గోరువెచ్చని నీటిలో (Lukewarm water) కొద్దిగా నిమ్మరసం (Lemon juice) కలుపుకోవాలి. ఈ నీటిలో 15 నిమిషాలపాటు పాదాలను ఉంచాలి. తర్వాత పొడి వస్త్రంతో పాదాలను శుభ్రపరుచుకుని అలాగే రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ (Moisturizer) ను అప్లై చేసుకుంటే పాదాల పగుళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.
 

బొప్పాయి గుజ్జు, నిమ్మరసం: బొప్పాయి గుజ్జులో (Papaya pulp) కొద్దిగా నిమ్మరసం (Lemon juice) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు  మర్దన చేసుకోవాలి. ఇలా చేయడంతో పాదాలలోని మురికి తొలగిపోయి పాదాలు శుభ్రపడుతాయి. ఇలా చేయడంతో  పాదాల పగుళ్ళ సమస్యకు దూరంగా ఉండవచ్చు.
 

గోరువెచ్చని నీరు, బేకింగ్ సోడా: పాదాలను సున్నితంగా మార్చడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో (Lukewarm water) రెండు స్పూన్ ల బేకింగ్ సోడాని (Baking soda) కలుపుకోవాలి. ఈ నీటిలో 20 నిమిషాలపాటు పాదాలను ఉంచాలి. ఇలా చేయడంతో పాదాలలోని మృత కణాలు నశించి పాదాలలోని ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది.

click me!