వేడి వేడి స్పైసీ చికెన్ పులావ్ ఇలా చేస్తే అదిరిపోయే రుచి?

First Published Nov 17, 2021, 3:50 PM IST

స్పైసీ చికెన్ పులావ్ (Spice chicken pulav) ఇంట్లోనే సులభంగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఇది పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎంతగానో నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా స్పైసీ చికెన్ పులావ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 


కావలసిన పదార్థాలు: 500గ్రా చికెన్ (Chicken), రెండు కప్పుల బాస్మతి బియ్యం (Basmathi rice), చిన్న ముక్క చెక్క (Cinnamon), 5 లవంగాలు (Cloves), 3 యాలకులు (Cardamom), 2 బిర్యానీ ఆకు (Bay leaf), ఒక స్పూన్ గరం మసాలా (Garam masala), రెండు ఉల్లిపాయలు (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies).
 

మీ రుచికి సరిపడు కారం (Rad chilli powder),  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriyander powder), ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice), సగం కప్పు కొబ్బరి పాలు (Coconut milk), నూనె (Oil), నెయ్యి (Ghee), రుచికి సరిపడు ఉప్పు (Salt), పుదీనా తరుగు (Mint), కొత్తిమీర తరుగు (Coriyander).
 

తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి అందులో పోపుకు సరిపడు నూనె (Oil) వేసి రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee) వేయాలి. నూనె వేడెక్కిన తరవాత ఇందులో లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు వేసి లైట్ గా వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి.
 

ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకొన్న చికెన్ (Chicken) ముక్కలను వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాపొడులు చికెన్ కి పట్టేలా బాగా కలపాలి. ఇలా పది నిమిషాల పాటు తక్కువ మంట మీద మూత (Lid) పెట్టి ఉడికించుకోవాలి.
 

తర్వాత ఇందులోనే కొబ్బరి పాలు, నీళ్లు పోసి వెంటనే శుభ్రం చేసి కడిగి పెట్టుకొన్న బాస్మతి రైస్ ను కూడా చేర్చి, తగినంత ఉప్పు (Salt), నిమ్మరసం వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే స్పైసీ చికెన్ పులావ్ రెడీ. చికెన్ పులావ్ ను  పెరుగు (Curd) పచ్చడితో వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది.
 

సర్వ్ (Serve) చేసే ముందు పుదీనా, కొత్తిమీర తరుగుతో గార్నిష్ (Garnish) చేసి సర్వ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీ పిల్లలకు కుటుంబ సభ్యులకు ఎంతగానో నచ్చుతుంది.

click me!