పంటి నొప్పి తరచూ ఇబ్బంది పెడుతోందా.. తక్షణ ఉపశమనం కలిగించే ఔషధాల ఇవే!

First Published Nov 17, 2021, 1:16 PM IST

పంటి నొప్పి (Toothache) ఉన్నప్పుడు చిన్న సమస్యగా భావించి దాన్ని అంతగా పట్టించుకోము. కానీ పంటి నొప్పిని నిర్లక్ష్యం చేయరాదు. పళ్ళు పుచ్చినప్పుడు, దంతాల లోకి ఇన్ఫెక్షన్ తాలూకు బ్యాక్టీరియా చేరినప్పుడు పంటి నొప్పి కలుగుతుంది. పంటి నొప్పి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దంతాలు బ్యాక్టీరియా నివాసం వల్ల తీపి పదార్థాలను, పిండి పదార్థాలను ఇప్పుడు ఏర్పడే ఆమ్లాలు పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. ఎనామిల్ దెబ్బతినడంతో పంటి నొప్పి సమస్యలు ఏర్పడతాయి. అలాంటప్పుడు కొన్ని ఉత్తమమైన మార్గాల ద్వారా పంటినొప్పిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం కొన్ని ఔషధాల గురించి తెలుసుకుందాం..
 

వెల్లుల్లి, లవంగాలు: వెల్లుల్లి (Gerlic), లవంగాలు (Cloves) పంటి నొప్పిని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వెల్లుల్లి లవంగాలు తీసుకుని దాన్ని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే నొప్పి నుంచి తొందరగా విముక్తి కలుగుతుంది. దీంతో దీర్ఘకాలంగా వేధించే పంటి సమస్యలు తగ్గిస్తాయి. 
 

ఉల్లిపాయ: ఉల్లిపాయ (Onion) క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పంటి నొప్పిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఉల్లిపాయను రెండు నిమిషాలు నమిలితే దంతాలలో ఇన్ఫెక్షన్ (Infection) కారణంగా చేరిన బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. దాంతో నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది.
 

లవంగాలు, ఆలివ్ ఆయిల్: లవంగాల (Cloves) పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ (Olive oil) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న దంతాలపై రాస్తే నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా చేయడంతో మంచి ఫలితం ఉంటుంది.
 

గోరువెచ్చని నీరు, ఉప్పు: పంటి నొప్పి ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటిలో (Warm water) ఉప్పు (Salt) కలుపుకొని ఆ నీటిని నోట్లో వేసి పుక్కిలించి ఉమ్మి వేయాలి. గోరువెచ్చని నీరు, ఉప్పు సహజ యాంటీసెప్టిక్ లా పనిచేస్తాయి. దీంతో దంతాలలో ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండి నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
 

ఆవ నూనె, ఉప్పు: ఆవనూనె (Mustard oil) లో కొంచెం ఉప్పు (Salt) కలుపుకొని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయడంతో నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 

వీట్ గ్రాస్ జ్యూస్: గోధుమ గడ్డి రసం (Wheat grass juice) దంత క్షయం కోసం ఒక మౌత్ వాష్ ఉపయోగిస్తారు. మీ చిగుళ్ళ నుండి విషక్రిములు బయటకు పంపటానికి సహాయపడుతుంది, బ్యాక్టీరియా (Bacteria) అభివృద్దిని తగ్గించి పంటి నొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి.
 

ఐస్ ముక్కలు: ఐస్ ముక్కలను (Ice cubes) పది నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు చొప్పున నొప్పి (Pain) ఉన్న దంత చంప భాగంలో ఉంచితే నొప్పి తగ్గుతుంది.

click me!