నిద్రలో మాట్లాడే అలవాటుందా? దీనికి కారణాలు ఇవే..!

Published : Jun 20, 2023, 09:42 AM IST

గాఢ నిద్రలోకి జారుకున్న వెంటనే చాలా మంది ఏదేదో మాట్లాడేస్తుంటారు. వారిని నిద్రలేపితే ఆ మాటలు ఆగిపోతాయి. దీన్నే స్లీప్ టాకింగ్ అంటారు. ఈ నిద్ర రుగ్మతకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

PREV
17
నిద్రలో మాట్లాడే అలవాటుందా? దీనికి కారణాలు ఇవే..!

స్లీప్ టాకింగ్ అనేది ఒక నిద్ర రుగ్మత. దీనివల్ల ఒక వ్యక్తి నిద్రలో తనకు తెలియకుండానే మాట్లాడేస్తుంటాడు. పక్కనవారితో సంభాషిస్తున్నట్టే మాట్లాడుతుంటారు. లేదా డైలాగులు కొడుతుంటారు. లేదా తమలో తామే గొణుగుతూ ఉంటారు. చాలా మందికి ఉండే అరుదైన సమస్య. కానీ ఇది కొద్దిసేపటి వరకు మాత్రమే ఉంటుంది. అసలు దీనికి కారణమేంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

నిద్రలో మాట్లాడటం సాధారణమా?

అధ్యయనాల ప్రకారం.. 66% మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది. ఏదేమైనా.. ఇది ఎక్కువగా రాదు. గత మూడు నెలల్లో కేవలం 17% మంది మాత్రమే నిద్రలో మాట్లాడారు. అయితే తాము నిద్రలో మాట్లాడుతాము అన్న సంగతి గురించి చాలా అరుదుగా తెలుస్తుంది. పక్కన పడుకునే వారికో, ఇంటి సభ్యులకు మాత్రమే ఆ వ్యక్తికి ఈ నిద్రలో మాట్లాడే రుగ్మత ఉందన్న సంగతి తెలుస్తుంది. వారి ద్వారానే నేను నిద్రలో మాట్లాడుతాను అన్న సంగతి తెలుస్తుంది.
 

37

కారణాలేంటి?

నిద్రలో మాట్లాడటానికి కారణమేంటో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మీ జెనెటిక్స్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్డి), నిరాశ, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యల వల్ల కూడా నిద్రలో మాట్లాడుతారన్నట్టు కనుగొనబడింది. ఇది పీడకలలతో కూడా సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిద్రలో మాట్లాడే అలవాటు ఎక్కువగా పిల్లలకే ఉంటుంది. 
 

47
snoring

యాంటి డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు కూడా నిద్రలో మాట్లాడటానికి కారణమవుతాయి. ఆల్కహాల్ ప్రభావంతో నిద్రపోవడం వంటి మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కూకడా నిద్రలో మాట్లాడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక జ్వరం కూడా స్లీప్ టాకింగ్ కు కారణమవుతుంది. 

57

దీన్ని ఎలా ఆపగలం?

నిద్రలో మాట్లాడటం అనేది చాలా అరుదుగా ఒక వ్యక్తికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది పక్కన పడుకున్న భాగస్వామికి కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. నిద్రను డిస్టబ్ చేస్తుంది. ఇది అరుదైన సంఘటన. అయితే దానిని పరిష్కరించడానికి మీకు నిర్దిష్ట శ్రద్ధ అవసరం లేదు. ఇది మరీ ఇబ్బందిగా మారితే డాక్టర్ సహాయం తీసుకోండి. అయితే నిద్రలో మాట్లాడే ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి కొన్ని చిట్కాలు సహాయపడతాయి. అవేంటంటే..
 

67
Image: Getty Images

ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు

ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు నిద్రలో మాట్లాడే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. దీనిలో సరైన సమయానినకి నిద్రపోవాలి. రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి, నిద్రలో మాట్లాడకుండా ఉండేందుకు  నిద్ర పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. ఇందుకోసం మంచి పరుపుపై పడుకోవాలి. అలాగే దిండులను బాగా శుభ్రపరుచుకోవాలి. మీరు పడుకున్న గదిలో శబ్దం లేకుండా చూసుకోవాలి. వెలుతురు ఎక్కువగా ఉండకూడదు. 

77

ఒత్తిడి ఉండకూడదు

చాలా మంది ఒత్తిడి, నిరాశ లేదా ఆందోళనగా ఉన్నప్పుడు నిద్రపోతారు. దీనివల్ల కంటినిండా నిద్రపోరు. రాత్రిళ్లు ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోవాలంటే శారీరక, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. అందుకే నిద్రపోయే ముందు ఒత్తిడితో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. నిద్రపోవడానికి ముందు ధ్యానం  చేయండి. ఇది మీరు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. హాయిగా నిద్ర కూడా పడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories