ఇవే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతయ్..!

First Published Jun 9, 2023, 10:38 AM IST

మన దేశంలో మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మధుమేహాన్ని పూర్తిగా తగ్గించుకోలేం. దీన్ని కేవలం నియంత్రించగలం అంతే. అయితే కొన్ని అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రిస్తాయి. 
 

ఒకే దగ్గర కూర్చోవడం

శారీరక శ్రమ చాలా చాలా అవసరం. ఇది లేకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందులో ఒకటి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. అవును పనికోసం ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాలంటే పని మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ నడవండి. 
 

diabetes diet

నీటిని తక్కవగా తాగడం

కొంతమంది తిన్నప్పుడు మాత్రమే నీళ్లను తాగుతుంటారు. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. కానీ ఈ డీహైడ్రేషన్ మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది. నీళ్లను తక్కువగా తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 

భోజనం స్కిప్ చేయడం / లేట్ గా తినడం

కొంతమంది పనుల్లో పడి భోజనం చేయడమే మర్చిపోతుంటారు. లేదా లేట్ గా తింటుంటారు. కానీ ఈ అలవాట్ల వల్ల మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. 
 

diabetes

మందుల మోతాదు

కేవలం మందులను తీసుకోవడం వల్లే డయాబెటీస్ నయం కాదు. వీటిని సరికాని మోతాదులో తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. 

ఒత్తిడి

ఒత్తిడి మానసిక సమస్యలనే కాదు.. శారీరక సమస్యలను కూడా కలిగిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీ జీవక్రియ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. దీనివల్ల కూడా మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. 

తక్కువ నిద్ర

మనలో చాలా మంది రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. కానీ తక్కువ నిద్ర ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. తక్కువగా నిద్రపోయే డయాబెటీస్ పేషెంట్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 

ఇతర మందులు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి మరొక కారణం ఇతర మందును తీసుకోవడం. మధుమేహులు ఇతర మందులను వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. 
 

diabetes

హార్మోన్ల మార్పులు

హార్మోన్ల స్థాయిలలో హెచ్చు తగ్గులు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఈ హార్మోన్ మార్పుల వల్ల కూడా కొంతమందిలో రక్తంలో చక్కెర పెరగడానికి కారణం అవుతాయి.

click me!