దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్, ప్రోయాంతోసైనిడిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిలోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు శ్వాసకోశ రుగ్మతలు, హృదయ సంబంధ సమస్యలు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యల ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడతాయి.