సమ్మర్ కదా అని కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా..?

First Published Jun 12, 2021, 10:10 AM IST

ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందట.  శరీరంలోని రోగనిరోధక శక్తి పూర్తి గా తగ్గిపోతుందట.
 

ఎండాకాలం వచ్చిందటే చాలు.. చాలా మంది మంచినీళ్లు తాగినంత సులభంగా కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. అదేంటో.. ఎండాకాలం అలా చల్లని కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే కిక్కే వేరు. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే.. గొంతులో దిగుతున్నప్పుడు కూల్ డ్రింక్ హాయిగా అనిపించినా.. దాని వల్ల తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ముఖ్యంగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందట. శరీరంలోని రోగనిరోధక శక్తి పూర్తి గా తగ్గిపోతుందట.
undefined
కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. అది.. ఇమ్యూన్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది. ఏదైనా అనారోగ్యం దరిచేరినప్పుడు.. దానితో యుద్దం చేసే సత్తాలో మీలో లేకుండా చేస్తుంది. దీంతో.. ఎక్కువ శాతం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
undefined
350ఎంఎల్ కూల్ డ్రింక్ లో దాదాపు 39 గ్రాముల షుగర్ ఉంటుంది. కాగా.. ఈ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి.
undefined
షుగర్... బ్యాక్టీరియా వైరస్ల సంతానోత్పత్తి ప్రదేశంగా పనిచేస్తుంది. శరీరమంతా సులభంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. షుగర్ రోగనిరోధక శక్తిని కూడా అణిచివేస్తుంది.
undefined
ఎలాంటివారిపైన అయినా.. ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి ప్రభావమే చూపించే ప్రమాదం ఉంది. ఇక టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారిలో అయితే.. మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందట.
undefined
డయాబెటీస్ తో బాధపడేవారు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తాయట. తెల్లరక్తకణాలు నశించిపోయేలా చేస్తాయి. కాబట్టి.. కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండటమే ఉత్తమం.
undefined
క్రమం తప్పకుండా సోడా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. షుగర్, తియ్యటి పానీయాలను నిత్యం తాగడం వల్ల వారిలోని ఇన్సులిన్ సున్నితత్వం తగ్గుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి కారణమౌతుంది.
undefined
అంతేకాకుండా.. ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు త్వరగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
undefined
click me!