ఈ సమస్యతో బాధపడుతున్నారా.. ప్రతిరోజు గుడ్డు తప్పనిసరి?

First Published Oct 17, 2022, 2:35 PM IST

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు అనుకూలంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఒక భాగమే గుడ్డు.ప్రతిరోజు ఒక గుడ్డును తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎలాంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాం...
 

egg

సాధారణంగా కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అనే విషయం మనకు తెలిసిందే. కోడిగుడ్డులో ఎన్నో రకాల పోషక విలువలతో పాటు విటమిన్లు కూడా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ ఏజెంట్ అధిక మొత్తంలో ఉండటం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అలాగే విటమిన్లు పొటాషియం కాల్షియం ఐరన్ వంటి పోషకాలు కూడా అత్యధికంగా ఉంటాయి.ఇలా పోషకాలు మెండుగా ఉన్నటువంటి గుడ్డును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

కోడిగుడ్డు సోనలో ఉండే కోలిన్ అనే పదార్థం మెదడు చురుకుదనానికి ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ఈ పదార్థం మెదడు కణాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి ఐరన్ ను శరీరం వెంటనే గ్రహించడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ అందిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఐరన్ మోతాదు అవసరమవుతుంది కనుక ప్రతిరోజు ఒక గుడ్డును తినడం వల్ల వారి శరీరానికి సరిపడా ఐరన్ లభిస్తుంది.

ఇకపోతే ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం ఎముకల గట్టిదనానికి దోహదపడతాయి. అలాగే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఒక గుడ్డును తినడం వల్ల జుట్టు గోర్ల ఆరోగ్యంగా పెరుగుదలకు తోడ్పడడమే కాకుండా, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా కోడిగుడ్డు కాపాడుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియం కాల్షియం పొటాషియం వంటి పోషకాలు ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి.
 

egg

ఇకపోతే చాలామంది నరాల బలహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఇలా నరాల బలహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇకపోతే ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అందుకే ప్రతిరోజు ఉడకబెట్టిన కొడుకును తినటం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.

click me!