స్మోకింగ్ డ్రింకింగ్ మానేయాలని భావిస్తున్నారా.. ప్రతిరోజు ఇలా చేస్తే చాలు?

First Published Oct 13, 2022, 3:12 PM IST

సాధారణంగా మన ఆరోగ్యానికి మధ్యపానం ధూమపానం ఆరోగ్యకరం అనే విషయం తెలిసినప్పటికీ చాలామంది వీటికి బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా మద్యం సిగరెట్ తాగడానికి అలవాటు పడిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొని వీటిని మానేయాలని చాలామంది ఆరాటపడుతుంటారు.ఈ అలవాట్ల నుంచి బయట పడాలంటే ఇలా చేస్తే చాలు...
 

సాధారణంగా ఒక మనిషి ఈ విధమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారిన వారు ఒక్కసారిగా అలవాట్లను మానుకోవడం కష్టమవుతుంది. పూర్తిగా అనారోగ్యాన్ని పాలయ్యి వారి ఆరోగ్యం పై శ్రద్ధ కలిగినప్పుడే ఎలాగైనా ఈ అలవాట్లను మానుకోవాలని భావిస్తారు. సాధారణంగా ధూమపానం మద్యపానం చేసేవారు ఈ అలవాట్ల నుంచి బయట పడాలంటే ఎక్కువ శాతం పచ్చిక బయళ్లలో గడపాలని నిపుణులు తెలియచేస్తున్నారు.
 

నేచురల్ ఎన్విరాన్‌మెంట్స్ అండ్ కార్వింగ్: ది మెడియేటింగ్ రోల్ ఆఫ్ నెగెటివ్ అఫెక్ట్.. అనే ఆధీనంలో భాగంగా నిపుణులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి మద్యపానం సిగరెట్ అలాగే జంక్ ఫుడ్ లకు అలవాటు పడినవారు ఈ అలవాట్లను మానుకోవడం ఎంతో కష్టతరం అవుతుంది.
 

ఈవిధమైనటువంటి అలవాట్ల నుంచి బయటపడాలంటే నిత్యం పచ్చదనంలో గడిపేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు.ఇలా పచ్చని ప్రకృతి నడుమ గడపడం వల్ల ఎవరూ కూడా చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిస కారని అటువైపు ఆకర్షితులు కూడా కారని ఈ అధ్యయనం ద్వారా నిపుణులు వెల్లడించారు.
 

మరి ఈ అలవాట్ల నుంచి బయటపడాలనుకునే వారు ఇప్పటినుంచి కాస్త మీ రోజువారి జీవితాన్ని ప్రకృతిలో గడపడానికి ప్రయత్నించి చూడండి మీలో కూడా ఇలాంటి మార్పులు తప్పకుండా వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కేవలం మద్యపానం ధూమపానం చేసే వారు మాత్రమే కాకుండా జంక్ ఫుడ్ లకు అలవాటు పడిన వారు కూడా ఇలా తమ రోజువారి జీవితాన్ని ప్రకృతిలో గడపడం వల్ల జంక్ ఫుడ్ అలవాట్లు కూడా మానుకుంటారని తెలిపారు.

click me!