గుండె సమస్యలతో బాధపడేవారు కనీసం వారంలో ఒక్కసారి శృంగారంలో పాల్గొనడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారట. ఈ విషయంపై 65 సంవత్సరాలు పైబడిన వారి నుంచి తీసుకున్న వివరాలు ఆధారంగా రూపొందించిన నివేదికల ద్వారా పలు విషయాలను తెలియజేశారు. ఈ నివేదికల ప్రకారం వారానికి ఒక్కసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో సుమారు 37 శాతం మరణాల రేటు తగ్గిందని, అంతకుమించి ఎక్కువసార్లు పాల్గొనే వారిలో 38 శాతం మరణాల రేటు పెరిగిందని తెలిపారు.