ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి
ఉక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులనే తినండి. అలాగే ప్రాసెస్ చేసిన, కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మానేయండి. ఎండలు మండుతున్నాయని సోడాలను తాగకండి. నీటిని, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలను మాత్రమే తాగండి. వేయించిన ఆహారాలకు బదులుగా కాల్చిన లేదా ఉడకబెట్టిన ఆహారాలను తినండి. మీ ఆహారంలో ఎక్కువ మొక్కల ఆధారిత భోజనాన్ని చేర్చితే మీరు ఆరోగ్యంగా ఉంటారు.