ఆస్తమా తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Apr 30, 2023, 02:47 PM IST

ఆస్తమా గురించి అవగాహన పెంచడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ప్రతి ఏడాది ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. భారతదేశంలో సుమారు 15 నుంచి 20 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. 

PREV
17
 ఆస్తమా తగ్గాలంటే ఇలా చేయండి..
asthma

ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఈ ఏడాది మే 2 న వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మే మొదటి మంగళవారం ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

27
asthma

ఆస్తమా, దాని కారణాల గురించి అవగాహన పెంచడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. భారతదేశంలో సుమారు 15 నుంచి 20 మిలియన్ల మంది ఉబ్బసంతో బాధపడుతున్నారు. దీనిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. మరి ఈ ఆస్తమా తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
Image: Getty Images

అలెర్జీలు, కాలుష్యం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల ఉబ్బసం వస్తుంది. అందుకే మీకు దేనికి అలెర్జీ ఉందో ముందు తెలుసుకోవాలి. మీకు దుమ్ముతో అలెర్జీ వస్తే ఇంటిని శుభ్రంగా, దుమ్ము లేకుండా ఉండేలా చూసుకోండి.

47
asthma

ఇన్హేలర్లు వంటి ఉబ్బసం మందులు ఈ ఉబ్బసం లక్షణాలను నియంత్రించడానికి సహాయపడతాయి. అయితే ఈ మందులను సరిగ్గా వాడకున్నా ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రస్తుత ఉబ్బసం చికిత్సా పద్ధతులలో ఇన్హేలర్ చికిత్స అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇన్హేలర్లు మందులను నేరుగా వాయుమార్గాలకు చేరవేస్తాయి. నేడు ఎన్నో రకాల ఇన్హేలర్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లల వయసును బట్టి వైద్యుల సలహా మేరకు ఇన్ హేలర్లను ఎంచుకోవచ్చు.

57
asthma

ఆస్తమా పేషెంట్లు నీటిని పుష్కలంగా తాగాలి. నీటిని ఎక్కువగా తాగితే మీ వాయుమార్గాలు తేమగా ఉంటాయి. అలాగే ఉబ్బసం ప్రమాదం కూడా తగ్గుతుంది.  ఇందుకోసం రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఆల్కహాల్, కెఫిన్ వంటి నిర్జలీకరణ పానీయాలను తాగకూడదు. 

67
asthma

ఊపిరితిత్తుల ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అయినప్పటికీ ఉబ్బసం ఉన్న కొంతమందికి వ్యాయామం తర్వాత ఉబ్బసం లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు రోజుకు 15 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. 

కృత్రిమ రంగు, కృత్రిమ స్వీటెనర్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతాయి.
 

77

asthma inhailer

ఆస్తమా పేషెంట్లు ఇంటిని నీట్ గా ఉంచుకోవాలి. ఇంట్లోని దుమ్ము కణాలను తొలగించి వారానికి కనీసం రెండుసార్లు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పనిలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. వారానికి ఒకసారి మంచాన్ని కడగడం వల్ల ఆస్తమాను కూడా నియంత్రించొచ్చు.

click me!

Recommended Stories