కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు తినండి
మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బొడ్డు కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ ను తినడం తగ్గించండి. లేదా పూర్తిగా మానుకోండి. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను పెంచుతుంది.