ప్రస్తుత కాలంలో షేప్ ను వేర్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి అన్ని రకాల సైజులు, ఆకారాల మహిళలకు కూడా సరిపోతాయి కాబట్టి. స్లిమ్మింగ్ బాడీ సూట్ల నుంచి టమ్మీ కంట్రోల్ ప్యాంటీల వరకు మనలో చాలా మంది మన రూపాన్ని మెరుగుపర్చుకోవడానికి షేప్ వేర్ లను ఉపయోగిస్తుంటాం. వీటిని ధరించడం వల్ల పొట్ట అసలే కనిపించదు. ఎంతో అందంగా కనిపిస్తారు కూడా. కానీ చాలా మంది ఆడవాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. వీటిని ప్రతిరోజూ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అవును ప్రతిరోజూ షేప్ వేర్ లను ఉపయోగించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వరకు ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Urinary
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
షేప్ వేర్ ను వేసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఇది యూటీఐ కి దారితీస్తుంది. అంతేకాదు కొన్ని షేప్ వేర్ ల దుస్తుల క్లాత్ మూత్రాశయాన్ని చికాకుపెడుతుంది. ఇది యూటీఐ ప్రమాదాన్ని మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది సంక్రమణకు సంకేతం కావొచ్చు.
yeast infections
ఈస్ట్ ఇన్ఫెక్షన్లు
షేప్ వేర్ వంటి టైట్ గా ఉండే దుస్తులను ధరించడం వల్ల యోని ప్రాంతంలో తేమ, వేడి పెరుగుతుంది. ఇది ఈస్ట్ వృద్ధి చెందేలా చేస్తుంది. టైట్ క్లాత్ బిగుతు యోని ప్రాంతంలో చాఫింగ్, చికాకు, చర్మం దురద వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కూడా దారితీస్తుంది. యోని చుట్టూ దురద, మంట లేదా వాపును వంటి సమస్యలను గమనించినట్టైతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చు.
స్కిన్ ఇన్ఫెక్షన్స్
చాలా టైట్ గా ఉండే షేప్ వేర్ మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇది చర్మ ఘర్షణకు కారణమవుతుంది. దీంతో చర్మపు చికాకు, సంక్రమణ వంటి సమస్యలు వస్తాయి. అలాగే షేప్ వేర్ ను ధరించే ముందు మీ చర్మంపై ఏదైనా కోతలు లేదా స్క్రాప్లు ఉంటే.. షేప్ వేర్ ను ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఈ గాయలను మరింత పెద్దది చేస్తుంది. అలాగే సంక్రమణకు దారితీస్తుంది.
వెన్నునొప్పి
రెగ్యులర్ గా షేప్ వేర్ ను వేసుకోవడం వల్ల మీ ఉదర, వెనుక కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది వెన్నునొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా చాలా టైట్ గా ఉంటే షేప్ వేర్ దుస్తులను ఉపయోగించడం వల్ల మీ కండరాలను లాగుతాయి. వెన్నునొప్పికి మరింత దోహదం చేసే కండరాల నొప్పులకు కారణమవుతాయి. షేప్ వేర్ ను ధరించడం వల్ల మీకు వెన్ను నొప్పి లేదా అసౌకర్యం వంటి సమస్యలు వస్తే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన సంకేతం కావొచ్చు.
జీర్ణ సమస్యలు
షేప్ వేర్ వంటి టైట్ గా ఉండే దుస్తులు మీ అంతర్గత అవయవాలను దగ్గరగా చేస్తాయి. అలాగే మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా ఆటంకం కలిగిస్తాయి. ఇది గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి వివిధ రకాల జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఎక్కువసేపు టైట్ గా ఉండే షేప్ వేర్ ను ధరిస్తే అది మీ కడుపు, ప్రేగులను కుదిస్తుంది. దీంతో ఈ ప్రాంతాల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది మరిన్ని జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. షేప్ వేర్ ను ధరించేటప్పుడు మీరు ఏదైనా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటే.. వదులుగా ఉండే దుస్తులు ధరించడం లేదా కడుపు ఆమ్ల ఉత్పత్తిని తగ్గించడానికి మందులు తీసుకోవడం వంటివి చేయండి.