నిపా వైరస్ అంటే ఏంటి? ఇది ఎలా సోకుతుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Sep 14, 2023, 11:16 AM IST

ఒకటి తర్వాత ఇంకోటి అన్నట్టు.. కరోనా పూర్తిగా వదిలి పోకముందే నిపా వైరస్ వ్యాప్తి చెందుతోంది. అందులోనూ దీనికి చికిత్స లేదు. అసలు ఈ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిపా వైరస్.. జూనోటిక్ వైరస్. ఇది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో..  వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. ఈ నిఫా వైరస్ కలుషితమైన ఆహారంతో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ను 1999లో మొదటిసారి గుర్తించారు. ఈ వైరస్ కు మలేషియాలోని సుంగాయ్ నిఫా అనే గ్రామం పేరు పెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిపా ఒక పారామైక్సో వైరస్. ఇది సాధారణ జలుబుకు కారణమయ్యే కొన్ని వైరస్ లలో ఒకటైన హ్యూమన్ పారాఇన్ఫ్లూయెంజా వైరస్ కు సంబంధించింది. ఈ వైరస్  ఫ్రూట్ గబ్బిలం, పెద్ద, చిన్న ఎగిరే నక్కలపై ఆవాసాలు చేసుకుని ఉంటుంది. ఇవి దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకు నిపా వైరస్ సోకిన కేసులన్నీ సోకిన గబ్బిలాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంపర్కం వల్ల సంభవించినవేనని నిపుణులు చెబుతున్నారు.
 

గబ్బిలాలలో సంక్రమణ సబ్ క్లినికల్. కాబట్టి ఎక్కువగా గుర్తించబడదు. అయితే ఈ వైరస్ మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అయితే గబ్బిలాల మూత్రంతో కలుషితమైన పండ్లు లేదా పండ్ల రసాల ద్వారే ఈ వైరస్ ప్రజలకు వ్యాప్తి చెందిందని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


health nipah virus

నిపా  వైరస్ సంకేతాలు, లక్షణాలు

నిపా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు ఎన్నో ఇతర సాధారణ అనారోగ్యాల సమస్యల మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట కూడా ఉన్నాయి. ఈ లక్షణాల తర్వాత మైకం, మగత, స్పృహ మారడం, నాడీ సంకేతాలు 24 నుంచి 48 గంటల్లో కోమాకు దారితీస్తాయి.
 


నినా వైరస్ సంకేతాలు, లక్షణాలు

నిపా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు ఎన్నో ఇతర సాధారణ అనారోగ్యాల సమస్యల మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట కూడా ఉన్నాయి. ఈ లక్షణాల తర్వాత మైకం, మగత, స్పృహ మారడం, నాడీ సంకేతాలు 24 నుంచి 48 గంటల్లో కోమాకు దారితీస్తాయి.
 

నిపా వైరస్.. శ్వాస ఆడకపోవడం, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిఫా ఇన్ఫెక్షన్ ఎన్సెఫాలిటిస్.. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిఫా వైరస్ సంక్రమణ.. విపరీతమైన జ్వరం, గందరగోళం, మూర్ఛ, మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

చికిత్స

నిపా వైరస్ సంక్రమణకు ప్రస్తుతం ఎలాంటి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. అయితే దీని లక్షణాలను, దీనివల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయక చికిత్స ఉంది. కాగా ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండటానికి సోకిన వ్యక్తులను ఐసోలేషన్ లో ఉంచాలి. అలాగే ఆరోగ్య కార్యకర్తలు తగిన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలను చేపట్టాలి. 
 

health nipah virus

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాంటాక్ట్ కు దూరంగా ఉండండి: జంతువులు, ముఖ్యంగా గబ్బిలాలు, అనారోగ్యం బారిన పడ్డ పందులకు దూరంగా ఉండాలని. ఎందుకంటే ఇవి వైరస్ ను వ్యాప్తి చేస్తాయి. గబ్బిలాల వల్ల కలుషితమైన పచ్చి ఖర్జూరం రసం లేదా పండ్లను అసలే తినకూడదు. 
 

వ్యక్తిగత పరిశుభ్రత: ఈ వైరస్ రాకూడదంటే మీ చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సబ్బు, నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 

ఐసోలేషన్: నిపా వైరస్ సోకిన వ్యక్తులను ఐసోలేషన్ లో ఉంచాలి. అలాగే ఇన్ఫెక్షన్ నియంత్రణ జాగ్రత్తలను తీసుకోవాలి. 
 

click me!