మానసిక స్థితి మార్పులు
మానసిక స్థితి, భావోద్వేగాలను ప్రభావితం చేయడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. జనన నియంత్రణ మాత్రలు తీసుకునేటప్పుడు హార్మోన్ల స్థాయిలలో మార్పులు మానసిక స్థితి హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. వీటితో పాటుగా గర్భనిరోధక మాత్రల వల్ల పీరియడ్స్ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ కావడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు రక్తపోటు పెరగడం, కడుపు ఉబ్బరం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.