పిల్లలు రోజూ పాలు తాగాలా?

First Published Apr 27, 2023, 7:15 AM IST

పిల్లలకు పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎదిగే పిల్లలు పాలు తాగితే వారి ఆరోగ్యంగా బాగుంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి. అయితే పిల్లలు రోజూ పాలను ఖచ్చితంగా తాగాలా? 
 

పిల్లలకు పాలను ఒక ముఖ్యమైన పానీయంగా పరిగణిస్తారు. ఎందుకంటే పాలు తాగడం వల్ల వారి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు గ్లాసుల పాలను తాగడం మంచిదని చాలా మంది చెప్తుంటారు. ఒకప్పుడు ఎదిగే బిడ్డకు పాలను ఖచ్చితంగా తాగించేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది పిల్లలకు పాలను తాగించడమే మానేసారు. అసలు పిల్లలకు రోజూ పాలు తాగించాలో లేదో ఆప్పుడు తెలుసుకుందాం.. 

పిల్లలకు పాలను తాగించడం వల్ల కలిగే ప్రయోజనాలు    

రోజంతా చురుకుగా ఉండి త్వరగా ఎదుగుతున్న పిల్లలు ప్రతిరోజూ పాలను తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. 
 

Latest Videos


విటమిన్ల భాండాగారం

పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలు రోజూ పాలు తాగితే వారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే పెరుగుతున్న పిల్లలకు తప్పకుండా పాలను ఇవ్వాలి. 
 

రికెట్స్ నుంచి ఎముకలను రక్షిస్తుంది

పాలలో అధిక కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు దెబ్బతినకుండా,  ఆరోగ్యంగా ఉంటాయి. కాల్షియం సరిగ్గా గ్రహించడానికి మనకు విటమిన్ డి అవసరం. పాలలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది రికెట్స్ ను నివారించడానికి, విటమిన్ డి లోపాన్ని పోగొట్టడానికి సహాయపడుతుంది.
 

 ప్రోటీన్ కు గొప్ప మూలం

పాలు నాణ్యమైన ప్రోటీన్ కు గొప్ప మూలం. ఒక కప్పు పాలలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది పిల్లల పెరుగుదల, అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే పాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పాలలో రెండు రకాల ప్రోటీన్లు ఉన్నాయి. ఒకటి కేసైన్, రెండు పాలవిరుగుడు ప్రోటీన్. ఈ రెండు ప్రోటీన్లు ఎక్కువ నాణ్యత ప్రోటీన్లుగా పరిగణించబడతాయి. పాల ప్రోటీన్ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన మొత్తం 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది.
 

దంత క్షయాన్ని నివారిస్తుంది

పిల్లలలో దంత క్షయం సర్వసాధారణం. పాలు దంతాల ఎనామెల్ ను కాపాడి చిగుళ్లను బలోపేతం చేస్తాయి. పాలలో క్యాల్షియం, ఫాస్పరస్ లు ఉంటాయి. క్రమం తప్పకుండా పిల్లలుు పాలు తాగితే దంతక్షయం బారిన పడరు. భోజనం చేసేటప్పుడు నీటికి బదులుగా పాలు తాగేలా చూడండి. 

click me!