టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 13, 2024, 1:53 PM IST

చాలా మంది మొబైల్ చూస్తూ టాయిలెట్ లో చాలా సేపు కూర్చుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ టాయిలెట్ లో గంటల తరబడి ఉంటే మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

చాలా మందికి మొబైల్ ను పట్టుకుని టాయిలెట్ కు వెళ్లే అలవాటు ఉంటుంది. ఇంకేముందు సోషల్ మీడియా ఓపెన్ చేసేసి చూస్తుంటారు. దీనివల్ల ఎంత సేపు టాయిలెట్ లో ఉంటున్నారో తెలియకుండా ఫోన్ల లో లీనమైపోతుంటారు. కానీ టాయిలెట్ లేదా వాష్ రూం లో ఎక్కువ సేపు కూర్చోవడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొంతమంది సమయాన్ని ఆదా చేయడానికి టాయిలెట్ సీటుపై కూర్చొని న్యూస్ పేపర్ ను చదువుతుంటారు.
 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. టాయిలెట్ సీటులో 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి చాలా డేంజర్. టాయిలెట్ సీటులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇధి సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ అలవాటు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
 

Latest Videos


హేమోరాయిడ్స్ సమస్య

టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్స్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ సీటులో కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి బాగా పడుతుంది. దీని వల్ల వాపు, గడ్డలు అవుతాయి. ఈ ముద్దలు హేమోరాయిడ్స్ గా మారుతాయి. అందుకే ఈ అలవాటును మానుకోవడం మంచిది. 
 

సంక్రమణ ప్రమాదం

మరుగుదొడ్డి లోపల సీటుపై ఎన్నో రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి అంటు వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మొబైల్ లేదా న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మొబైల్, పేపర్ కు అంటుకుంటుంది. మనమేమో మొబైల్ ను శుభ్రం చేయం. దీనివల్ల సంక్రమణ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే టాయిలెట్ లోకి మొబైల్ ను తీసుకెళ్లకండి. 
 

జీర్ణక్రియలో సమస్యలు

పొట్టను శుభ్రం చేసుకోవడానికి టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చుంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. నిజానికి టాయిలెట్ సీట్ లో ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల మీ పొట్టపై ఒత్తిడి బాగా పడుతుంది. దీనివల్ల కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. 

కాళ్లలో వాపు

టాయిలెట్ సీటుపై ఒకే పొజీషన్ లో ఎక్కువ సేపు కూర్చుంటే దిగువ వీపుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల పాదాలలో వాపు, జలదరింపు, పాదాల తిమ్మిరి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

వెన్నునొప్పి

టాయిలెట్ సీటులో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వీపు, నడుము కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది కండరాలలో వాపు, తిమ్మిరిని కలిగిస్తుంది. దీనిని లైట్ తీసుకుంటే ఈ సమస్య బాగా పెరిగిపోతుంది. 

నరాల ఒత్తిడి

టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు ఒకే పొజీషన్ లో కూర్చోవడం వల్ల నరాలలో ఒత్తిడి కలుగుతుంది. ఇది కేవలం పాదాల్లోనే కాదు చేతులు, మెడ నరాల్లో కూడా వస్తుంది. అందుకే నరాల సమస్యలు ఉన్నవారు టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చోకూడదు. 

click me!