వేడి అలసటకు దారితీస్తుంది. కాసేపు వేడిలో ఉన్నా.. అధిక చెమట, మూర్ఛ, మైకము, అలసట, వేగవంతమైన పల్స్, తలనొప్పి , వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫలితంగా వడ దెబ్బ తగులుతుంది. శరీరం 104 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు హీట్‌స్ట్రోక్ సంభవిస్తుంది. ఇతర లక్షణాలతో పాటుగా గందరగోళం, మాట తడపడటం, వికారం లేదా వాంతులు, హార్ట్ బీట్ పెరిగిపోవడం లాంటివి కూడా జరుగుతాయి.