ఉదయాన్నే పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగితే అధిక బరువు నుంచి బీపీ వరకు ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో

First Published | Dec 6, 2023, 7:15 AM IST

మనం ప్రతిరోజూ తినే  టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును టమాటాల్లో ఉండే ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. మీకు తెలుసా? టమాటా జ్యూస్ ను పరిగడుపున తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

tomato juice

టమాటాలే లేని కూరలు ఉండనే ఉండవు కదా. మనం చేసుకునే కూరల్లో టమాటాలు పక్కాగా ఉంటాయి. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? టమాటాలు కేవలం కూరలను టేస్టీగానే చేస్తాయని. కానీ టమాటాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. టమాటాలు ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్న కూరగాయ. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్, లైకోపీన్ తో పాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

tomato juice

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవును ఉదయాన్నే పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టమాటాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే టమాటా జ్యూస్ ను ఉదయాన్నే తాగడం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. అలాగే గట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాలు విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం.


tomato juice

అందుకే ప్రతిరోజూ ఉదయం పరగడుపున టమాటా జ్యూస్ ను తాగితే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పొటాషియం మెండుగా ఉండే టమాటా జ్యూస్ ను ఉదయాన్నే ఖాళీకడుపుతో తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే హైబీపీ పేషెంట్లు దీన్ని రెగ్యులర్ గా తాగొచ్చు. 

tomato juice

టమాటాల్లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కప్పు చిన్న టమాటా జ్యూస్ లో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగొచ్చు. 

అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ అధిక బరువు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అయితే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి టమాటా జ్యూస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీళ్లు రెగ్యులర్ గా టమాటా జ్యూస్ ను తాగితే బరువు తగ్గుతారు. అలాగే చర్మం కూడా  ఆరోగ్యంగా ఉంటుంది. 

Latest Videos

click me!