ఈ సింపుల్ ఫుడ్ తో మలబద్దకానికి గుడ్ బై చెప్పండి

Published : May 10, 2023, 07:15 AM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లను కూడా వాడుతుంటారు. అయితే ఒక సింపుల్ ఫుడ్ తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.   

PREV
14
ఈ సింపుల్ ఫుడ్ తో మలబద్దకానికి గుడ్ బై చెప్పండి

నేటి జీవనశైలి కారణంగా చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్దకం వల్ల కొందరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. మరికొందరికీ మలబద్ధకం తీవ్రమైన సమస్యగా మారుతుంది. అయితే మలబద్ధకం సమస్యకు అసలు కారణాలేంటో తెలుసుకుంటే ఈ సమస్య నుంచి బటయపడొచ్చు. మలబద్ధకం నుంచి వెంటనే బయటపడటం ఎలా? అంటూ చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. అయితే ఓట్ మీల్ (గంజి) మలబద్ధకానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ తీవ్రమైన సమస్య నుంచి బయటపడొచ్చు.
 

24


ఓట్ మీల్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఓట్ మీల్ ను బ్రోకెన్ వీట్ అని కూడా అంటారు. దీనిని అల్పాహారంలో తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మీకు త్వరగా ఆకలిగా అనిపించదు. అలాగే అతిగా తినకుండా ఉంటారు. ఓట్ మీల్ లో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. మీరు ఉదయం అల్పాహారంలో వోట్మీల్ ను చేర్చుకుంటే దీని ప్రయోజనాలను కొన్ని రోజుల్లోనే చూస్తారు. ఓట్ మీల్ లో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలకు కూడా సహాయపడుతుంది. ఓట్ మీల్ లో ఉండే ఫైబర్ పేగులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
 

34
oatmeal

గంజి దేనితో తయారవుతుంది?

గంజి ఏ రకమైన ధాన్యం నుంచైనా తయారవుతుంది. భారతదేశంలో గంజి గోధుమల నుంచి తయారవుతుంది. కానీ మీరు మొక్కజొన్న లేదా జొన్న, సజ్జ ల నుంచి గంజిని తయారుచేసి తాగండి. 
 

44
Image: Getty Images

గంజి తాగడానికి సరైన సమయం, మార్గం

మలబద్దకం సమస్యతో బాధపడేవారికి ఓట్ మీల్ ఎంతో మేలు చేస్తుంది. ఓట్ మీల్ ను ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా తినాలి. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే మీరు గంజిని పాలతో కలపొచ్చు లేదా ఉప్పగా చేయొచ్చు. దీన్ని ఎప్పుడూ తీసుకున్నా కడుపులోకి వెళ్లిన వెంటనే త్వరగా జీర్ణం అవుతుంది.
 

click me!

Recommended Stories