మీకు పంటి నొప్పి ఉందా? ఈ ఆకును తినండి ఇట్టే తగ్గిపోతుంది

Published : May 09, 2023, 07:15 AM IST

మనలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. కానీ ఈ పంటి నొప్పి ఏ పనీ చేయనీయదు. ఈ నొప్పిని తగ్గించడానికి జామ ఆకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయంటున్నారు నిపుణులు.   

PREV
14
మీకు పంటి నొప్పి ఉందా? ఈ ఆకును తినండి ఇట్టే తగ్గిపోతుంది

జామకాయలే కాదు దాని ఆకులు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకులను ఎన్నో ఏండ్లుగా పంటి నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. నిజానికి ఈ ఆకులు దంత క్షయాన్ని తగ్గిస్తాయి. మంటను తగ్గించి దంతాలను ఆరోగ్యంగా ఉంచే లక్షణాలను కలిగి ఉంటాయి ఈ ఆకులు. ఈ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలలోని బ్యాక్టీరియాను చంపడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి జామ ఆకులను పంటి నొప్పిని తగ్గించడానికి ఎలా తీసుకోవాలి? ఈ ఆకుల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24

పంటి నొప్పిని తగ్గించడానికి, దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు జామ ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ గా తయారు చేయొచ్చు లేదా దీన్ని రసాన్ని ఉపయోగించొచ్చు. ఇందుకోసం

కొన్ని తాజా జామ ఆకులను తీసుకోండి. అలాగే కొన్ని పిప్లీ, లవంగాలు తీసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పును కలపండి. ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేయండి.ఇప్పుడు ఈ ముతక పేస్ట్ ను దంతాలకు అప్లై చేయండి.
 

34

పంటి నొప్పిలో జామ ఆకుల ప్రయోజనాలు

యాంటీ బాక్టీరియల్

ఈ యాంటీ బ్యాక్టీరియల్ పేస్ట్ ను ఉపయోగించి పంటి నొప్పులను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆకుల రసాన్ని ఉపయోగించొచ్చు. ఇది దంతాల లోపల ఉన్న బ్యాక్టీరియాను చంపడంతో పాటుగా దంతాలలోని పురుగులను కూడా చంపుతుంది. ఈ విధంగా జామ ఆకులు పంటి నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి.

44

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

జామ ఆకులు, పొడవాటి మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చిగుళ్ల వాపును తగ్గించి పంటి నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా దంతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తుంది. దీని వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది. కాబట్టి మీకు పంటి నొప్పి ఉన్నప్పుడు ఈ హోం రెమెడీని ట్రై చేయండి. తక్షణ ఉపశమనం పొందుతారు. 

click me!

Recommended Stories