Exercise చేసిన వెంటనే నీళ్లు తాగకండి చాలా డేంజర్

First Published | Sep 19, 2024, 12:13 PM IST

వ్యాయామం(Exercise) చేసేటప్పుడు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం కొంతమంది మధ్య మధ్యలో వాటర్ తాగుతారు. కొందరు ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయాక తాగుతారు. ఇలా చేయడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్రమ్స్ వస్తాయని డాక్టర్లు, కోచ్ లు చెబుతున్నారు. మరి వర్కవుట్స్ పూర్తయిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ఇటీవల జనాల్లో ఆరోగ్యంపై చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని నాజూగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఎక్కువ మంది వ్యాయామం చేస్తున్నారు. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. వర్కవుట్స్ మన శరీరాన్ని బలంగా మారుస్తాయి. ఇది రోజూ చేస్తే ఆరోగ్యకరమైన అలవాటుగా కూడా మారుతుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి. శరీర బరువు తగ్గుతుంది. అంతేకాకుండా ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

మామూలుగా శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల వ్యాయామం సమయంలో కండరాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. కండరాల పెరుగుదల సక్రమంగా జరుగుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. వ్యాయామం తర్వాత నీరు లేదా ఎనర్జీ పానీయాలు తాగడం మంచిదే. అయితే ఎక్సర్సైజ్ చేసిన వెంటనే నీరు తాగడం మంచిది కాదు. మీకు ఈ అలవాటు ఉంటే, అలా తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos


ఎలక్ట్రోలైట్‌లు బయటకు పోతాయి: మనం వ్యాయామం చేసేటప్పుడు నీరు మాత్రమే కాకుండా సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లు కూడా చెమట ద్వారా మన శరీరం నుండి బయటకు పోతాయి. వ్యాయామం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల మన శరీరంలోని ఎలక్ట్రోలైట్ కంటెంట్ తగ్గి నీటి శాతం ఎక్కువై పోతుంది. దీని వల్ల కండరాల నొప్పులు, తల తిరగడం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వ్యాయామం తర్వాత వెంటనే నీరు తాగకుండా కాస్త ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ఆహారాలు, ఎనర్జీ పానీయాలను తీసుకోవడం మంచిది.

కండరాల సమస్య: వర్కవుట్స్ తర్వాత మన శరీరం దాని సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల వ్యాయామం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల కండరాలు పట్టేసినట్లు అవుతుంది. అవి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇది కణజాలంలో నీటి కంటెంట్‌ను పెంచుతుంది. కొన్నిసార్లు వాచే అవకాశం కూడా ఉంటుంది. వ్యాయామం పూర్తయిన 15, 30 నిమిషాల తర్వాత నీరు తాగడం వల్ల కండరాల కణజాలం రిపేర్ అవుతుంది.

ఎక్సర్సైజ్ తర్వాత ఇవి తీసుకోండి: వ్యాయామం తర్వాత అరటిపండు తినండి. ఎందుకంటే ఈ పండు మీ కండరాలకు శక్తినివ్వడానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి సహాయపడుతుంది. మీరు వ్యాయామం తర్వాత వెజ్ బిర్యానీ తినవచ్చు. ఇది శరీరాన్ని బలంగా, చురుగ్గా ఉంచుతుంది. అదేవిధంగా వ్యాయామం తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ కంటెంట్, తగినంత కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ కూడా తినడం మంచిది. వ్యాయామం తర్వాత ఒక కప్పు పెరుగు తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీర జీవక్రియను పెంచడమే కాకుండా వ్యాయామం తర్వాత మన కండరాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది.

click me!