ఆల్కహాల్ ను మానేయడం
చేతులు వణకడానికి మందును మానేయడం కూడా ఒకటి. ముఖ్యంగా చేతుల్లో. ఎందుకంటే మీ శరీరం ఆల్కహాల్ లేకపోవడానికి సర్దుబాటు చేస్తుంది. ఇది ఆల్కహాల్ వ్యసనానికి సంకేతం కూడా. దీనిలో మీరు ఆల్కహాల్ తాగిన ఆరు నుంచి పది గంటల గ్యాప్ తర్వాత ఇలా చేతుల్లో వణుకు వస్తుంది. మందును ఎక్కువగా తాగడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. శరీర శక్తి స్థాయి తగ్గుతుంది. ఆల్కహాల్ ప్రభావం వల్ల మెదడు నరాల పనితీరును పెంచుతుంది. మందును అకస్మత్తుగా ఆపేసినప్పుడు ఆందోళన, హైపర్ యాక్టివిటీ, వణుకు వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డ వ్యక్తికి ఇలా వణుకు రాదు. ఆల్కహాల్ ను ఎక్కువ రోజుల నుంచి తాగితే కాలెయం, మెదడు, నరాలకు హాని కలిగిస్తుంది. అంతేకాదు ఇది మీరు ఎప్పుడూ వణికేలా చేస్తుంది.