ఎండాకాలంలో పుచ్చకాయను ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లు ఒక్క ఎండాకాలంలోనే పండుతాయి. ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలోని వాటర్ కంటెంట్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే దీనిలోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయ బరువు తగ్గేందుకు, డీహైడ్రేషన్, వేసవి దాహం వంటి సమస్యలను పోగొట్టేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ పండును కొన్ని పండ్లతో కలిపి తింటే దీని ప్రయోజనాలకు బదులుగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పుచ్చకాయతోనే కాదు దీన్ని తిన్న తర్వాత కూడా ఈ పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అసలు పుచ్చకాయను తిన్న వెంటనే వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..