దంత సమస్య గర్భిణీ స్త్రీలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

First Published Oct 24, 2021, 4:47 PM IST

దంతాలు (Teeth) ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా (Health) ఉంటాము. దంతాల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాం.

దంతాలు (Teeth) ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా (Health) ఉంటాము. దంతాల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. అందుకే దంతాలను దృడంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 

సాధారణంగా గర్భిణీ స్త్రీలు (Pregnant women) కూడా వివిధ రకాల దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. గర్భధారణ సమయంలో దంతాల సంరక్షణకు చికిత్స తీసుకోవడం సరైనదా కాదా అని సందేహంతో ఇబ్బందులు పడుతుంటారు.

అయితే గర్భధారణ (Pregnency) సమయంలో దంత పరీక్షలు చేయించుకోవడం మంచిదని డాక్టర్లు (Doctor) చెబుతున్నారు. దంత సమస్యలు కడుపులోని బిడ్డ పై ప్రభావితం చూపుతాయి. కాబట్టి దంత డాక్టరును సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదే.

అయితే మొదటి మూడు నెలల్లో (Months) అత్యవసరమైతే దంత పరీక్షలు చేయించుకోవాలి. మూడు నెలల తరువాత చికిత్స చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు (Difficulties) కలగవని డాక్టర్లు చెబుతున్నారు.

సరైన ఆహారం (Food)తీసుకోవడం, వ్యాయామంతో (Excercises) పాటు దంత సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దంత ఆరోగ్యం బాగుంటుంది. అయితే  అమెరికా చేపట్టిన సర్వే ప్రకారం 56% గర్భిణీ మహిళలు దంత పరీక్షలు చేయించుకోలేదని వెల్లడయింది. 
 

గర్భిణి స్త్రీల నోటిలో ఆమ్ల గుణాలు (Acidic properties) అధికంగా ఉండటం వల్ల చిగుళ్లలో రక్తస్రావం, దంతక్షయం సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. గర్భిణీ సమయంలో హార్మోన్ల (Hormones) ప్రభావంతో చిగుళ్ళు సున్నితంగా మారుతాయి.

గర్భిణీ సమయంలో చిగుళ్లకు ఇన్ఫెక్షన్ (Infection) వస్తే అది బిడ్డకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉంటే ఎటువంటి అపోహలు, అనుమానాలు లేకుండా దంత వైద్యుని సంప్రదించడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే చిగుర్లు వ్యాధిని (Disease of the shoots)  నిర్లక్ష్యం చేస్తే ప్రసవం తర్వాత అది మరింత ముదిరే అవకాశం ఉంటుంది. 
 

వేవిళ్లు (Whales) ఎక్కువగా ఉండే స్త్రీల నోటిలో ఆమ్ల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. దీంతో దంత ఎనామెల్ దెబ్బ తింటుంది. దంత నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రసవం (Childbirth) ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో తీసుకునే దంత చికిత్సల వలన తల్లికి, బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగదు.

click me!