రోజుకు ఇన్నీ గుడ్ల కంటే ఎక్కువ తింటే ఊహించని జబ్బులు.. ఎందుకు వస్తాయో ఇప్పుడు చూద్దాం!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 24, 2021, 04:42 PM IST

గుడ్డు (Egg) లో కావలసినంత ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు (Protiens) లభిస్తాయి.

PREV
17
రోజుకు ఇన్నీ గుడ్ల కంటే ఎక్కువ తింటే ఊహించని జబ్బులు.. ఎందుకు వస్తాయో ఇప్పుడు చూద్దాం!

గుడ్డు (Egg) లో కావలసినంత ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు (Protiens) లభిస్తాయి. కానీ గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది ఎంతవరకు నిజమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 

27

ఇంతకు ముందు జరిగిన పరిశోధనలో గుడ్డులో అధిక ప్రోటీన్లు, కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు (Heart problems), అకాల మరణాలు (Death) కలుగుతాయని తెలిసింది.
 

37

అయితే గతంలో జరిగిన పరిశోధనలకు (Survey) విరుద్ధంగా యూఎస్ ఒక అధ్యయనాన్ని చేపట్టగా అందులో గుడ్లలో ఆరోగ్యానికి మంచి చేసే కొలెస్ట్రాల్ (Cholesterol) ఉంటుందని తేలింది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు రావని క్లారిటీ వచ్చింది.
 

47

గుడ్డులో 185 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. 
ఇది రోజూ శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ లో సగం కన్నా తక్కువ. గుడ్డులోని కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలోకి కలవకుండా గుడ్డులోని లెసిథిన్ (Lecithin) అనే రసాయనాలు కాపాడుతాయి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి (weight loss) సహాయపడుతుంది.

57

తెల్లసొనలో ఉండే ప్రొటీన్లు కాస్త నెమ్మదిగా జీర్ణం అవుతుంది. గుడ్డు తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి  ఏర్పడుతుంది. దీంతో త్వరగా ఆకలిగా అనిపించదు. ఈ ప్రొటీన్లు (Proteins) జీర్ణం కావడానికి కొంత శారీరక శక్తి (Physical strength) అవసరమవుతుంది. దీంతో బరువు తగ్గుతారు.
 

67

గుడ్డులోని కొలెస్ట్రాల్ శరీరంలో కణజాలము పెరగడానికి ఉపయోగపడుతుంది. రక్తనాలల్లో చెడు కొలెస్ట్రాల్  పేరుకు పోయినప్పుడు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గుడ్డు ఎక్కువగా తింటే గుండె జబ్బులు (Heart problems) వస్తాయని భయంతో వారానికి రెండు మూడు గుడ్లు  తింటున్నారని పలు సర్వేలలో (surveys) తేలింది.
 

77

రోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని దీనిలో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మంచి కలిగిస్తాయని అధ్యయనంలో తెలిపారు. రోజు గుడ్డు తీసుకోవడం వల్ల డయాబెటిస్(Diabetes), గుండె సంబంధిత వ్యాధులపైన ఎలాంటి ప్రభావం చూపించదు. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కు, ఎటువంటి ఇతర ప్రమాదకర వ్యాధులకు గుడ్డుతో (Egg) ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రోజుకు ఒక గుడ్డు తినాలి.

click me!

Recommended Stories