లైంగిక కోరికలను పెంచే కాయ గురించి మీకు తెలుసా.. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి!

Navya G   | Asianet News
Published : Mar 28, 2022, 02:31 PM IST

సుగంధ ద్రవ్యాలలో జాజికాయకు (Nutmeg) చాలా ప్రత్యేకమైన కీలక స్థానం ఉంది. ఇది ఆహారానికి మంచి రుచి, వాసనను అందించడంతో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్న అద్భుతమైన సుగంధ ద్రవ్యం.  

PREV
18
లైంగిక కోరికలను పెంచే కాయ గురించి మీకు తెలుసా.. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి!

దీనిని పాలలో కలిపి తీసుకుంటే లైంగిక కోరికలు (Sexual desires) పెరుగుతాయని శృంగార  నిపుణులు చెబుతున్నారు. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

లైంగిక సమస్యలను తగ్గిస్తుంది: జాజికాయలో పురుషులలో లైంగిక లక్షణాలను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషులలో అంగస్తంభన సమస్యలు (Erectile problems), లైంగికపటుత్వం లేకపోవడం (Lack of sexuality), శృంగారంపై కోరికలు తగ్గడం వంటి లైంగిక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించి లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు రెట్టింపు చేసి శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేందుకు సహాయపడతాయి.
 

38

వీర్యకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది: స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక కోరికలను పెంచి వారి లైంగిక జీవితం సాఫీగా జరిగేందుకు జాజికాయ సహాయపడుతుంది. ఇది పురుషులలో నరాల బలహీనతను (Nerve weakness) దూరం చేసి శృంగారం సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే పురుషులలో నాణ్యమైన వీర్యకణాల (Sperm) ఉత్పత్తికి సహాయపడుతుంది. కనుక దీనిని పాలలో కలిపి తీసుకుంటే స్త్రీ, పురుషులిద్దరి లైంగిక జీవితం మెరుగుపడుతుంది.
 

48

మెదడు ఉత్తేజపరుస్తుంది: జాజికాయలో మెదడును ఉత్తేజపరిచే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అలసట, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. అంతేకాకుండా నిద్రలేమి (Insomnia) సమస్యలను దూరం చేసి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. జాజికాయ మెదడుకు అద్భుతమైన టానిక్ లా పని చేసి మెదడు ఆరోగ్యాన్ని (Brain health) మెరుగుపరుస్తుంది.
 

58

జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి: జాజికాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు, అజీర్తి, డయేరియా వంటి జీర్ణసంబంధిత సమస్యలు (Digestive problems) తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన మలినాలను శరీరం నుండి బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీంతో ఉదర భాగం (Abdominal health) ఆరోగ్యంగా ఉంటుంది.
 

68

మూత్రసంబంధిత సమస్యలు తగ్గుతాయి: మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లను కరిగించడానికి జాజికాయ ఎంతో దోహదపడుతుంది. అలాగే కాలేయం (Liver), మూత్రపిండాల (Kidney) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గుండె సంబంధిత సమస్యలు రాకుండా జాజికాయ కాపాడుతుంది.
 

78

చర్మసంబంధిత సమస్యలు తగ్గుతాయి:  జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను (Dermatological problems) తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక దీనిని తరచూ పాలలో కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన, మృదువైన చర్మ సౌందర్యాన్ని  పొందవచ్చును.
 

88

వీటితో పాటు జాజికాయను పాలలో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు (Arthritis), అధిక రక్తపోటు (High blood pressure), జలుబు, దగ్గు, ఋతు సమయంలో ఏర్పడే నొప్పులు, జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. అయితే జాజికాయను ఆయుర్వేద నిపుణుల సలహాతో ఎంత పరిమాణంలో వాడాలో తెలుసుకుని ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు.

click me!

Recommended Stories