డెంగ్యూ జ్వరం లక్షణాలు ఇవే.. ఇలా ఉంటే వెంటనే ఈ పనులు చేయండి..?

First Published Nov 20, 2021, 4:31 PM IST

డెంగ్యూ జ్వరం (Dengue fever) వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈడిస్ ఈజిప్టై అనే ఆడ దోమ (Mosquito) కుట్టడంతో డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది ఈడిస్ ఈజిప్టై దోమ కుట్టడంతో ఇన్ఫెక్షన్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరం వచ్చిన వారిని తీవ్రమైన నొప్పులు వేధిస్తాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. డెంగ్యూ మొదటి దశలో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడంతో తొందరగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం..
 

బొప్పాయి ఆకులు: బొప్పాయి ఆకులు (Papaya leaves) డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. పచ్చి బొప్పాయి ఆకులను మిక్సీ జార్ లో తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ చొప్పున ప్రతిరోజూ తీసుకోవాలి. ఈ రసం బ్లడ్ ప్లేట్ (Blood plate) ను పెంచి డెంగ్యూ జ్వరం నుంచి తొందరగా కోలుకునేలా చేస్తాయి.
 

మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ (Immunity Power) తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల వైరస్ లు, ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. డెంగ్యూ లక్షణాలను (Dengue symptoms) ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. విపరీతమైన జ్వరం రావడం, వాంతులు, తలనొప్పి, చర్మ సమస్యలు, బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గడం, కీళ్ల నొప్పులు డెంగ్యూ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ సమస్యలు మీలో ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో  డెంగ్యూ వ్యాధి వ్యాపించకుండా చూడవచ్చు. ఇప్పుడు హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం..
 

దానిమ్మ జ్యూస్: దానిమ్మ జ్యూస్ (Pomegranate juice) తీసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర నీరసాన్ని తగ్గించి బ్లడ్ ప్లేట్స్ ను పెంచుతాయి. దానిమ్మ జ్యూస్ ను రోజు తీసుకోవడంతో డెంగ్యూ జ్వరం తొందరగా తగ్గుతుంది.
 

ఆరెంజ్ జ్యూస్: ఆరెంజ్ జ్యూస్ (Orange juice) లో విటమిన్స్ (Vitamins) పుష్కలంగా  ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగడంతో శరీరానికి వ్యాధితో పోరాడే శక్తిని అందిస్తుంది. నీరసాన్ని తగ్గించి డెంగ్యూ జ్వరం తొందరగా తగ్గడానికి  సహాయపడుతుంది.
 

పసుపు: పసుపులో (Turmeric) ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ లెవెల్స్ ను పెంచడానికి ఉపయోగపడతాయి. గోరు వెచ్చని పాలలో (Milk) కొంచెం పసుపు కలుపుకుని తాగడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 

కొబ్బరి నీళ్ళు: డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు  కొబ్బరి నీళ్ళు (Coconut water)తాగించడం మంచిది. కొబ్బరి నీళ్ళు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరానికి కావల్సిన పోషకాలను (Nutrients) అందిస్తుంది. డెంగ్యూ జ్వరాన్ని  తగ్గించడానికి కొబ్బరినీళ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

click me!