మోతీచూర్ లడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఓ సారి ఇలా చేసి చూడండి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 20, 2021, 03:59 PM IST

ఏదైనా మంచి శుభవార్త (Good news) విన్నప్పుడు నోరు తీపి చేయాలని అంటారు పెద్దలు. తీపి పదార్థాలు శుభసంకేతం. స్వీటు పదార్థాలంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకు, బంధువులకు పెట్టేందుకు కాస్త స్వీటు, హాటూ రెండూ తప్పనిసరి. అలా చేసుకునే పిండి పదార్థాలలో మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) ప్రధాన స్థానంలో ఉంది.   

PREV
17
మోతీచూర్ లడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఓ సారి ఇలా చేసి చూడండి?

మోతిచూర్ లడ్డూను దేవునికి నైవేద్యంగా కూడా పెడతారు. లడ్డు విధానం తక్కువ సమయంలో చేసుకోవచ్చు. దీని రుచి (Taste) కూడా బాగుంటుంది. ఎప్పుడు మీరు బూందీ లడ్డు, రవ్వ లడ్డులను ట్రై చేసి ఉంటారు. ఈసారి మోతిచూర్ లడ్డూ కూడా ట్రై చేయండి. ఇది మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎంతగానో నచ్చుతుంది. ఇప్పుడు ఏ ఆర్టికల్ (Article) ద్వారా ఎలా తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు: రెండు కప్పుల సెనగపిండి (Besan flour), కొద్దిగా ఫుడ్ కలర్ (Food colour), రెండు కప్పుల పంచదార (Sugar), కొంచెం యాలకుల పొడి (Cardamom powder), బాదం (Almonds), పిస్తా (Pista), కాజు (kaju), మూడు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), ఢీ ఫ్రైకి సరిపడు ఆయిల్ (Oil). 
 

37

తయారీ విధానం: ఒక గిన్నెలో (Bowl) రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఫుడ్ కలర్, నీళ్ళు వేసి ఉంటలు (lumps) లేకుండా కలుపుకోవాలి. పిండిని జారుగా బూందీ పిండిలాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.
 

47

ఇప్పుడు మరొక గిన్నెలో రెండు కప్పుల పంచదారను (Sugar) తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు (Water) పోసి గులాబ్ జామ్ పాకంలా పాకాన్ని తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోండి.
 

57

బూందీ తయారీ కోసం స్టవ్ మీద బాండ్లి పెట్టి అందులో ఆయిల్ (Oil) వేసి వేడి చేయాలి. ఆయన వేడెక్కిన తర్వాత అందులో కలుపుకున్న మిశ్రమాన్ని బూందీలా జారవిడవండి. బూందీ  మంచి కలర్ (Colour) వచ్చాక  ఒక గిన్నెలోనికి తీసుకోవాలి.
 

67

ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, కాజు, పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో లడ్డూల (Laddu) ఉండలు చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ (Ready).
 

77

దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పండగ సమయంలో ఇలా తయారుచేసుకున్న లడ్డులను నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఈ లడ్డు (Laddu) మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతగానో నచ్చుతుంది (Likes). ఎంత తొందరగా తక్కువ సమయంలో చేసుకునే లడ్డు ఇది. మోతిచూర్ లడ్డూ రుచికి తిరుగుండదు. పండుగ సమయంలో, ఫంక్షన్లలో ఈ లడ్డూను చేసి బంధువులు, అతిథులకు నోరు తీపి చేయండి.

click me!

Recommended Stories