చర్మ సౌందర్యాన్ని పెంచే బొప్పాయి ఫేషియల్స్.. అవి ఎలా తయారు చెయ్యాలంటే?

First Published Nov 20, 2021, 4:08 PM IST

చర్మ సౌందర్యం కోసం అందరూ  ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దానికోసం తరచూ బ్యూటీ పార్లర్ (Beauty Parlor) కు వెళుతుంటారు. అనేక వేల రూపాయలు పెట్టి ఫేషియల్ క్రీములు వాడుతారు. దీంతో మనకు తాత్కాలిక నిగారింపు లభిస్తుంది. ఆర్టిఫిషియల్ క్రీమ్స్ (Artificial creams) వాడకం తగ్గించండి. ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లలో ఉండే రసాయనాలు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. దాంతో చర్మం సహజసిద్ధమైన నిగారింపును కోల్పోతుంది. చర్మ నిగారింపుకు బొప్పాయి ఫేషియల్స్ ఉపయోగపడతాయి. బొప్పాయి ఫేషియల్స్ తో  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని బ్యూటీషియన్స్   తెలుపుతున్నారు. ఈ బొప్పాయి ఫేషియల్స్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా బొప్పాయి ఫేషియల్స్ ను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

చర్మ సౌందర్యాన్ని పెంచడానికి బాగా పండిన బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా బాగా పండిన బొప్పాయిని తీసుకోవాలి. బొప్పాయిలో విటమిన్ ఎ, పెఫైన్ అనే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ (Dead skin cells) ను తొలగిస్తాయి. ఈ ఫేషియల్ మొటిమలను (Pimples), మొటిమల ద్వారా ఏర్పడే మచ్చల తగ్గిస్తాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. చర్మంకు కావలసిన తేమను అందించి చర్మం నిగనిగలాడుతూ ఉండేలా చేస్తుంది. ఇది సహజసిద్దమైన ఫేస్ ప్యాక్. దీని తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

బొప్పాయి గుజ్జు (Papaya pulp) మిశ్రమాన్ని ముఖంపై రాస్తూ చేతి వేళ్లతో గుండ్రంగా మర్ధన చేసుకోవాలి. ఇలా దాదాపు అరగంట వరకు సున్నితంగా మసాజ్ (Massage) చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంతో చర్మం మృదువుగా తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది.
 

బాగా పండిన బొప్పాయి గుజ్జులో (Papaya pulp)  పంచదార (Sugar) వేసి బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తరువాత బొప్పాయి గుజ్జును ముఖానికి రాస్తూ సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇది చర్మంపై ఉండే మృతకణాలను తగ్గిస్తుంది. దాంతో చర్మ నిగారింపు పెరుగుతుంది.
 

బొప్పాయి గుజ్జులో (Papaya pulp)  ఆలివ్ ఆయిల్ (Olive oil) వేసి మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంతో చర్మం కాంతివంతంగా తెల్లగా మారుతుంది.
 

బొప్పాయి గుజ్జులో (Papaya pulp)  కోడిగుడ్డు తెల్ల సొనను (Egg white yolk) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకున్న అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. నీ ఫేస్ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా తయారు చేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది.
 

బొప్పాయి గుజ్జులో (Papaya pulp) నిమ్మరసాన్ని (Lemon juice) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ చర్మం నిగారింపును పెంచుతుంది.

click me!