మళయాళ హీరో ఫహద్ ఫాసిల్ తెలియని వారు ఉండరేమో. ఆయన ఎలాంటి పాత్రలు అయినా ఈజీగా చేసేయగలరు. ఓ వైపు హీరోగా అదరగొడుతూనే.. మరోవైపు స్పెషల్ రోల్స్, విలన్ రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. తెలుగులో పుష్ప తో ఆయన ఎంట్రీ ఇచ్చారు. పుష్పలో అల్లు అర్జున్ కి సరైన పోటీ ఇచ్చే పోలీసు పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న పుష్ప2 లోనూ మొయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ కావడం విశేషం. ఆ మూవీతో.. ఆయనకు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్స్ బేస్ పెరిగిపోయింది.
కాగా, తాజాగా ఆయన తన అభిమానులకు ఓ వార్త చెప్పి షాకిచ్చారు. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం. తాను అటెన్షన్ డెఫిసిట్, హైపరాక్టివ్ డిజార్డర్ ( ADHD) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. తనకు ఈ వ్యాధి ఉందని రీసెంట్ గానే తెలిసింది అని ఆయన చెప్పడం విశేషం.
నిజానికి ఇది.. చిన్న పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇది ఉన్న పిల్లలు ఎవరైనా మనకు చూడటానికి చాలా నార్మల్ గానే ఉంటారు. కానీ.. వాళ్లు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. వాళ్లు.. తమ బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోలేరు. ఫోకస్ ఉండదు. ఇంపల్సివ్ లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నతనంలోనే చికిత్స తీసుకోకపోతే.. ఇది పెద్దయ్యాక కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
fahad faasil
ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లల్లో ఈ అటెన్షన్ డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)ఉన్నట్లు గుర్తిస్తున్నారు. అయితే.. దీనిని చిన్నతనంలో గుర్తిస్తే నయం చేయగలరు. కానీ.. వయసు పెరిగిన తర్వాత.. దానిని నయం చేయడం చాలా కష్టం. కాగా.. ఇదే విషయాన్ని ఫహద్ ఫాసిల్ కూడా చెప్పారు. ఈ వయసులో తనకు ఈ వ్యాధి నయం అవుతుందా అని డాక్టర్ ని అడిగాను అని , కానీ ఈ వయసులో కష్టం అని చెప్పారని.. ఇక తాను జీవితాంతం దానిని భరించాల్సిందే అని చెప్పడం గమనార్హం.
ఫహద్ ఫాసిల్ మొదటి నుంచి మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. పరభాషా చిత్రాలైన 'సూపర్ డీలక్స్', 'విక్రమ్', 'పుష్ప' చిత్రాల్లోనూ నటించి అందరినీ మెప్పించాడు. కాగా.. రీసెంట్ గా ఆయన నటించిన ఆవేశం సినిమా మాత్రం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కాగా... విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాసుల వర్షం కూడా కురిపించింది. రూ.30కోట్లతో తీసిన ఈ చిత్రం.. రూ.150కోట్లు రాబట్టడం గమనార్హం.