పుదీనాతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలున్నాయి.. తినకుంటే మిస్సైపోతారు మరి

Published : Jul 26, 2023, 07:15 AM IST

పుదీనా కమ్మని వాసన రావడమే కాదు.. వంటలను మంచి టేస్టీగా కూడా చేస్తుంది. అంతేకాదు ఇది మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఈ ఆకు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం నుంచి నోటి దుర్వాసనను తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.  

PREV
17
పుదీనాతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలున్నాయి.. తినకుంటే మిస్సైపోతారు మరి

mint leaves

పుదీనా ఆకుల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన వాళ్లు తక్కువే. కేవలం ఈ ఆకులు కమ్మన వాసన, వంటలను టేస్టీగా చేస్తాయనే చాలా మంది అనుకుంటారు. కానీ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడం నుంచి మానసిక అనారోగ్య సమస్యలను తగ్గించడం వరకు ఈ సుగంధ మూలిక మనకు ఎంతో మేలు చేస్తుంది. అసలు పుదీనాతో మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

mint leaves

డైజెస్టివ్ రిలీఫ్

ప్రస్తుత కాలంలో మలబద్దకం, అజీర్థి సమస్యలను ఎదుర్కొంటున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి వారికి పుదీనా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పుదీనాలో సహజ యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ ఆకులు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకులు కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి. 
 

37

రోగనిరోధక  శక్తిని పెంచుతుంది 

పుదీనా ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఫాస్పరస్, కాల్షియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తి పెంచడానికి  సహాయపడతాయి. ఇది కణాల నష్టం నుంచి కూడా కాపాడుతాయి. దీంతో దీర్ఘకాలిక అనారోగ్యం ప్రమాదం తగ్గుతుంది. 
 

47

mint

మొటిమలు తగ్గుతాయి

పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా మొటిమలు ఉన్నవారికి ఈ ఆకులు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. పుదీనా ఆకులలో ఎక్కువ మొత్తంలో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

57

మార్నింగ్ సిక్ నెస్, వికారం

పుదీనా ఆకులు మార్నింగ్ సిక్ నెస్ కు సంబంధించిన వికారాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇది జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది. తరచుగా మార్నింగ్ సిక్నెస్ తో బాధపడే గర్బిణులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

67

అలెర్జీలు, ఉబ్బసం

పుదీనా ఆకుల్లో రోస్మరినిక్ ఆమ్లం అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అలెర్జీని ఉత్పత్తి చేసే సమ్మేళనాలను నిరోధిస్తుంది. అలెర్జీలు, ఉబ్బసంతో బాధపడుతున్నవారికి ఇది బాగా సహాయపడుతుంది.

77

జలుబుకు

సీజన్ మారడంతో ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడతారు. ముఖ్యంగా వానాకాలం, చలికాలంలో జలుబు చాలా కామన్. అయితే దీన్ని తగ్గించేందుకు పుదీనా బాగా సహాయపడుతుంది. పుదీనా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జలుబు, శ్వాస మెరుగ్గా తీసుకోవడానికి హాయపడుతుంది. అంతేకాదు పుదీనాలోని యాంటీ బాక్టీరియల్ గుణం దగ్గు వల్ల కలిగే చికాకు నుండచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories