రోజ్ వాటర్ తో ఈ కంటి సమస్యలన్నీ మటుమాయం..!

Published : Jul 25, 2023, 02:54 PM IST

రోజ్ వాటర్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రోజ్ వాటర్ కంటికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజ్ వాటర్ ను ఉపయోగించి ఎన్నో కంటి సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.   

PREV
16
 రోజ్ వాటర్ తో ఈ కంటి సమస్యలన్నీ మటుమాయం..!
rose water

రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా చేయొచ్చు. మచ్చలను పోగొట్టడంతో పాటుగా ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఈ రోజ్ వాటర్ మన కళ్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రోజ్ వాటర్ కంటికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
rose water

కంటి ఎరుపు, చికాకు నుంచి ఉపశమనం

రోజ్ వాటర్ లో సహజ శోథ నిరోధక లక్షణాలు  పుష్కకంగా ఉంటాయి. ఈ లక్షణాలు కంటి ఎరుపు, చికాకు నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. అందుకే మీ కళ్లు ఎర్రగా ఉన్నప్పుడు రోజ్ వాటర్ ను ఉపయోగించండి. 
 

36

హైడ్రేషన్ 

ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్ ను ఎక్కువగా చూడటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. పొడిబారుతాయి. అయితే రోజ్ వాటర్ అలసిన కళ్లను హైడ్రేట్ చేస్తుంది. రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. పొడి, కంటి అసౌకర్యాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. 
 

46
Image: Freepik

డార్క్ సర్కిల్

రోజ్ వాటర్ లో తేలికపాటి ఆస్ట్రింజెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే రోజ్ వాటర్ కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  ఇది మీ కళ్లకు ప్రకాశవంతమైన, మరింత యవ్వన రూపాన్ని ఇస్తుంది.

56
rose water

యాంటీ ఏజింగ్ 

రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి రోజ్ వాటర్ మన కళ్లను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి కాపాడుతుంది. అలాగే మీరు మరింత యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. 

66

కంటి ఒత్తిడి

ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం వల్ల కళ్లు అలసటకు గరవుతాయి. అయితే అలసిన కళ్లపై రోజ్ వాటర్ ను అప్లై చేయడం వల్ల వాటిని పునరుజ్జీవింపజేస్తుంది. ఇది కంటి ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది.

click me!

Recommended Stories