Health Tips: టీతో పాటు రస్కులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

Navya G | Published : Sep 13, 2023 10:59 AM
Google News Follow Us

Health Tips: చాలామంది టీ తాగే సమయంలో రస్కులు తింటూ ఉంటారు. అయితే రస్కులు అంత ఆరోగ్యకరమైనవి  కాదు. టీ కాంబినేషన్తో రస్కులు తీసుకోవటం  అస్సలు ఆరోగ్యకరమైనది కాదు. దీనివలన ఎంత ప్రమాదమో  ఇప్పుడు తెలుసుకుందాం.
 

16
Health Tips: టీతో పాటు రస్కులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

Health Tips: చాలామంది టీ తాగే సమయంలో రస్కులు తింటూ ఉంటారు. అయితే రస్కులు అంత ఆరోగ్యకరమైనవి  కాదు. టీ కాంబినేషన్తో రస్కులు తీసుకోవటం  అస్సలు ఆరోగ్యకరమైనది కాదు. దీనివలన ఎంత ప్రమాదమో  ఇప్పుడు తెలుసుకుందాం.
 

26

 మార్కెట్లో అధికంగా శుద్ధి చేసిన పిండి నూనెతో రస్కులు తయారుచేస్తారు. అందుకే వీటిని రోజు తినటం అనారోగ్యం. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రెడ్ కంటే రస్కులు అధికంగా క్యాలరీలను కలిగి ఉంటాయి. రస్క్ అనేది కేవలం డిహైడ్రేటెడ్ బ్రెడ్.
 

36

 అంటే బ్రెడ్ లోంచి తేమను పూర్తిగా తొలగిస్తే అది రస్క్ కింద మారుతుంది. దీనికి చక్కెరను జోడించడం వల్ల రుచికరంగా చేస్తారు. ఇదంతా మిగిలిపోయిన బ్రెడ్ తో తయారు చేస్తారని చాలామందికి తెలియదు. అలాగే రస్కుల తయారీలో వాడే నూనె కూడా మంచిది కాదు.
 

Related Articles

46

 ఈ నూనె శరీరంలో ఎక్కువగా చేరటం వల్ల రక్తనాళాల్లోని రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వస్తాయి. దీని వలన గుండెపోటు కూడా రావచ్చు.  అలాగే రోజు రస్కులు తినడం వల్ల అందులో ఉండే పంచదార మీకు మధుమేహ సమస్యలను, గుండె సమస్యలను..
 

56

కిడ్నీ సమస్యలను, చర్మ సమస్యలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది. రస్కులలో యాంటీ న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం పోషకాలు సంగ్రహించకుండా అడ్డుకుంటుంది. అలాగే రెగ్యులర్ గా టీ తో కాంబినేషన్ గా రస్కులు  తీసుకోవడం వలన పేగులకి పొక్కులు సమస్యని కలిగిస్తాయి.
 

66

ఇది గ్యాస్, అజీర్ణం అలాగే కడుపులో ఇతర సమస్యలకు దారితీస్తుంది. అలాగే రస్కులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫుడ్ ఎడిటింగ్ ప్రెజర్వేటివ్ లు కలుపుతారు. అందుకే రస్కులు ఎక్కువగా తింటే  స్థూలకాయం సంభవిస్తుంది. కాబట్టి టీ కాంబినేషన్ తో రస్కులు వాడకపోవడం మంచిది.

Recommended Photos