మన శరీరానికి నీరు చాలా చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు బతకగలుగుతాడు. కానీ నీరు లేకుండా మాత్రం బతకలేడని చెప్తుంటారు. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.
Image: Getty Images
రోజూ 8 నుంచి 9 గ్లాసుల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. రోజూ నీటిని పుష్కలగా తాగడం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని ఆహారాలను తిన్న తర్వాత నీటిని తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో నీటిని తాగడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలను తిన్న తర్వాత నీటిని ఎట్టి పరిస్థితిలో తాగకూడదు. ఇలా తాగితే గ్యాస్, ఎసిడిటీతో పాటుగా జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే ఎలాంటి ఆహారాలను తిన్న తర్వాత నీటిని తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటి పండు
అరటిపండ్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే అరటిపండ్లను తిన్న తర్వాత నీళ్లను ఎక్కువగా తాగితే కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి అరటిపండ్లను తింటున్నప్పుడు లేదా తర్వాత నీటిని తాగకండి.
సిట్రస్ పండ్లు
నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో జ్యూసినెస్ ఉంటుంది. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటున్నప్పుడు, తిన్న తర్వాత నీటిని తాగకూడదు. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది.
పెరుగు
పెరుగు పాలతో తయారయ్యే ఒక పదార్థం. ఇది మన జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మీ గట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు తిన్న వెంటనే నీళ్లను తాగడం వల్ల ఈ ప్రోబయోటిక్స్ నశిస్తాయి.
Image: Getty
స్పైసీ ఫుడ్
స్పైసీ ఫుడ్ ను తింటున్నప్పుడు చాలా మంది నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. అయితే స్పైసీ ఫుడ్ ను తింటున్నప్పుడు లేదా తిన్న తర్వాత నీటిని తాగితే కడుపు చికాకు పెరుగుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.