ఒంట్లో శక్తి పెరగాలంటే..!

First Published | Jul 28, 2023, 1:15 PM IST

చిన్న చిన్న పనులను చేసినా కొంతమంది ఎంతో అలసిపోతుంటారు. దీనికి కారణం శరీరంలో శక్తి స్థాయిలు తగ్గడం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచొచ్చు. 
 

మీరెప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటారా? అయితే మీ ఒంట్లో ఎనర్జీ తగ్గినట్టేనంటున్నారు నిపుణులు. మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ మెరుగ్గా ఉన్నప్పుడే మనం మన పనులన్నింటినీ చేసుకోగలుగుతాం. రోజంతా ఉత్సాహంగా ఉంటాం. అయితే కొంతమంది చిన్న పనులను చేసినా.. ఎంతో అలసిపోతుంటారు. శరీరంలో శక్తి స్థాయిలు తగ్గడం వల్లే అలసట వస్తుంది. ఈ అలసటను తగ్గించి ఒంట్లో శక్తి స్థాయిలు పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Getty

గాఢ నిద్ర

మీరు ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే ప్రతి రాత్రి మీరు 7 నుంచి 9 గంటలు ప్రశాంతంగా పడుకోవాలి. అలాగే రాత్రి తొందరగా పడుకోని, ఉదయం తొందరగా నిద్రలేవాలి. రోజూ ఒకే టైం ను పాటించాలి.  నిద్ర మీ శరీర శక్తి స్థాయిలను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. 


హైడ్రేట్ గా ఉండండి

నిర్జలీకరణం వల్ల మీరు అలసటగా ఉంటారు. ఇది శ్రద్ధను కూడా తగ్గిస్తుంది. అందుకే హైడ్రేటెడ్ గా ఉండండి. ఇది మీ ఎనర్జీ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. ఇందుకోసం నీటిని పుష్కలంగా తాగండి. 
 

Image: Getty

సమతుల్య భోజనం

శరీరంలో శక్తి స్థాయిలు పెరగాలంటే పోషకాహారాన్ని తినండి. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. 
 

Image: Getty

వ్యాయామం

వ్యాయామం ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. వ్యాయామం రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ఆక్సిజన్ పంపిణీని పెంచుతుంది. అలాగే ఎండార్ఫిన్లు రిలీజ్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా, రోజంతా తాజాగా ఉంచుతుంది. 
 

ఒత్తిడిని తగ్గిస్తుంది

దీర్ఘకాలిక ఒత్తిడి మీ శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. రోజంగా మీరు ఎనర్జిటిగ్ గా ఉండటానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, ఆరు బయట సమయం గడపడం లేదా నచ్చిన ఆహారాలను వండుకుని తినడం వంటి పనులను చేయండి. ఇవి మీ ఒత్తిడిని తగ్గించి, ఒంట్లో  శక్తిని పెంచుతుంది. 
 

సూర్యరశ్మి

ఆరుబయట అంటే ఎండలో కాసేపు అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి ని అందించడంతో పాటుగా మీ శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. సూర్యరశ్మి మీ శరీరం జీవగడియారాన్ని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది. 
 

కెఫిన్, చక్కెర వినియోగాన్ని తగ్గించండి

తక్షణ శక్తి కోసం కెఫిన్, చక్కెర లను తీసుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి వ్యసనానికి దారితీస్తాయి. అంతేకాదు శక్తిస్థాయలను కూడా తగ్గిస్తాయి. అందుకోసమే వీటిని తీసుకోకండి.

Latest Videos

click me!