ఆకలి తగ్గడానికి నీరు తాగాలి
చాలా మందికి ఆకలికి, దాహానికి మధ్య తేడా తెలియదు. దాహం వేసినా.. ఆకలి అవుతుందని తినేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా తరచుగా తింటే మీ బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
మీకు తెలుసా? ఆకలి అయినప్పుడు నీళ్లను పుష్కలంగా తాగండి. అయినా ఆకలిగా అనిపిస్తే తినండి. కానీ ఇలా చేయడం వల్ల మీరు హెవీగా తినరు. లిమిట్ లో తింటారు. నీళ్లను తాగితే కడుపు చాలా వరకు నిండుతుంది. ఆకలి తగ్గుతుంది. ఇలా మీ బరువు అదుపులో ఉంటుంది.
ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగితే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే మీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది మీ శరీరంలో ఎక్కువ కేలరీలను కరిగించడానికి సహాయపడుతుంది.
మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి
నీళ్లు తాగితే మీ శరీరంలోని హానికరమైన విషపదార్థాలు బయటకు పోతాయి. నీళ్లు మీ జీర్ణవ్యవస్థను, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ 10 గ్లాసుల వరకు నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.
ఈ అలవాటు మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా.. కొన్ని రోజుల్లోనే అలవాటు అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడికెళ్లినా వాటర్ బాటిల్ ను మీ వెంటే తీసుకెళ్లండి.