దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.. కొన్నిరోజుల్లోనే చక్కటి ఫలితం మీ సొంతం?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 02, 2021, 03:16 PM IST

మన శరీర ఆరోగ్యంతో పాటు దంత ఆరోగ్యం (Dental health) కూడా ముఖ్యమే. దంత ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. దంతాలు తెల్లగా, అందంగా మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ కొంతమందికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వారికి దంత సమస్యలు (Dental problems) వస్తుంటాయి. అలాంటివారు ఈ ఆర్టికల్ ద్వారా దంతాలు తెల్లగా మిళమిళగా మెరవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..   

PREV
18
దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.. కొన్నిరోజుల్లోనే చక్కటి ఫలితం మీ సొంతం?

దంతాలు చక్కటి పళ్ళ వరుసతో, తెల్లగా అందంగా  ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరికి దంతాలు పచ్చగా, గారు పట్టినట్లు ఉంటాయి. అలా ఉన్నప్పుడు నలుగురిలో మనస్ఫూర్తిగా (Satisfaction) నవ్వలేరు. మరికొందరికి నోటి దుర్వాసన (Stinking) వస్తూ ఉంటుంది. వీరు ఎదుటివారితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు.
 

28

అలాంటి వారు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. సరైన మౌత్ వాష్ (Mouth wash) తో నోటిని శుభ్రపరుచుకోవాలి (Cleanliness). మీకు దంత సమస్యలు ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం. ఇప్పుడు మనం దంత సంరక్షణ కోసం కొన్ని తీసుకోవలసిన చిట్కాల గురించి తెలుసుకుందాం. రోజుకు రెండు సార్లు మీ దంతాలను శుభ్రపరచుకోవాలి.
 

38

దంతాలను శుభ్ర పరచుకోవడానికి హార్డ్ బ్రష్ (Hard brush) ను వాడరాదు. రెండు నెలలకు ఒకసారి కొత్త బ్రష్ ఉపయోగించాలి. మింట్ టూత్ పేస్ట్ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతంది. ఫైబర్ (Fiber) ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే  దంతాలు శుభ్రంగా ఉంటాయి.
 

48

అలాగే సిట్రస్ (Citric) పండ్లు ఎక్కువగా తీసుకుంటే  దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రంగా ఉంచుతాయి. దంతాల శుభ్రతకు అవసరం అయ్యే సలివాను (Saliva) సిట్రస్ పండ్లు ఉత్పత్తి చేస్తాయి. ఇది  దంతాలు శుభ్రపరచడానికి, దంతాలను తెల్లగా మార్చడానికి సహయపడుతాయి.
 

58

స్ట్రాబెరి, కివి పండ్లలో విటమిన్ సి (Vitamin c) అధికంగా ఉంటుంది. ఇవి దంతాలను బలపరుస్తాయి. యాపిల్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి నోటికి కావలసిన లాలాజలం ఉత్పత్తి చేస్తాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడిలలో విటమిన్ కె (Vitamin k) అధికంగా ఉంటుంది.
 

68

వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇవి పళ్ళు ఎనామెల్  నిర్మాణంకు సహాయపడతాయి. దంతాలను తెల్లగా మార్చడానికి సహాయ పడుతుంది. నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ (Citric acid) ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ రసంలో (Lemon juice) ఉప్పు కలిపి దంతాలకు అప్లై చేస్తే దంతాలు తెల్లగా తళతళలాడేలా చేస్తాయి.
 

78

కాల్షియం (Calcium) తక్కువ అయినప్పుడు కూడా దంత సమస్యలు  వస్తుంటాయి. దీని కోసం గుప్పెడు నల్ల నువ్వుల గింజలతో (Sesame seeds) టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చేయండి మంచి ఫలితం ఉంటుంది. లవంగాలు దంత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే వెల్లుల్లి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దంతాల్లో ఉండే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. 
 

88

కార్బోనేట్ కూల్ డ్రింక్స్ (Cool drinks) ని తాగడం తగ్గించాలి. ఇవి దంతా ఎనామిల్ ను దెబ్బతీసిసాయి. ధూమపానం, మద్యపానం (Smoking), గుట్కా, తంబాకు వంటివి దంత సంరక్షణ దెబ్బతీస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగరాదు. మీ దంత సమస్యలు మిమ్మల్ని మరింత ఇబ్బంది కలిగిస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.

click me!

Recommended Stories