టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ వింటున్నారా..? ఈ విషయాలు మీకు తెలుసా?

First Published Nov 22, 2021, 10:11 AM IST

స్ట్రోక్, అల్జీమర్స్, మెదడుకు జరిగిన  గాయాలు చికిత్సలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీ.. అనే  చికిత్సా విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు.

మ్యూజిక్ వినడం మనలో చాలా మందికి  ఇష్టమైన వ్యాపకం. ఎదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు.. సంగీతం వినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలా మ్యూజిక్ వినడం వల్ల నిజంగా మనం టెన్షన్ నుంచి బయటపడతామా..? మ్యూజిక్ మెదడును చైతన్యం చేస్తుందా..? చురుకుగా పనిచేసేలా చేస్తుందా..? నచ్చిన పాట వినడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుందా..? అంతేకాకుండా.. అల్జీమర్స్ తో బాధపడేవారు ఈ పాటలు వినడం వల్ల..  ఆ సమస్య నుంచి బయటపడతారా..? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు.

స్ట్రోక్, అల్జీమర్స్, మెదడుకు జరిగిన  గాయాలు చికిత్సలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీ.. అనే  చికిత్సా విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు.

నిపుణుల పరిశోధనలో తేలిన విషయాల ప్రకారం... మానవుడి మెదడుపై సంగీతం చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. మెదడులో మాటలు, కదలిక జాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించే భాగాలు సంగీతం ఉత్తేజితం చేస్తుంది. భౌతికంగా బ్రెయిన్ మ్యాటర్ నూ పెంచుతుంది. మెదడు తనంతట తాను రిపేర్ చేసుకోవడానికి కూడా మ్యూజిక్ సహాయపడుతుందట.

Online Music

మెదడుపై సంగీతం చూపించే శక్తివంతమైన ప్రభవాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రోక్, పార్కిన్సన్స్, మెదడు గాయాల చికిత్సకు న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీని రంగంలోకి తెచ్చారు.


పిజియో థెరపీలానే ఇది కూడా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. రోగులు తమ లక్షణాలను సమర్థవంతంతగా ఎదుర్కొనడంలోనూ దైనందిన జీవితంలో కార్యకలాపాలను వారు మెరుగ్గా నిర్వహించుకోవడం లోనూ ఈ థెరపీ సహాయపడుతుంది.

click me!