మెదడు చురుకుగా ఉండాలంటే ఈ ఆహారం తప్పనిసరి.. అవి ఏంటో ఇక్కడ చూడండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 21, 2021, 08:22 PM IST

మెదడు (Brain) జ్ఞానేంద్రియాలన్నింటికి ముఖ్యమైన కేంద్రం. మెదడు ఎలా ఆదేశిస్తే అలా మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా పని చేస్తేనే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు మెదడు చురుగ్గా చేయడానికి, ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని (Memory) మెరుగు పరచడానికి సహాయపడతాయి.  

PREV
19
మెదడు చురుకుగా ఉండాలంటే ఈ ఆహారం తప్పనిసరి.. అవి ఏంటో ఇక్కడ చూడండి!

ఏ ఆహార పదార్థాలను జీవనశైలిలో (lifestyle) అలవాటు చేసుకుంటే మన మెదడు చురుగ్గా పని చేస్తుందో తెలుసుకోవాలి. మెదడు చురుకుదనాన్ని పెంచే ఆహార పదార్థాలను పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చడంతో వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో మతిమరపు (Forgetful) సమస్యలు తగ్గి వారు అన్నింటిలోనూ ఫస్ట్ ఉంటారు. ఇప్పుడు మెదడును చురుకుగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలియ చేయడమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం..
 

29

వాల్ నట్స్: వాల్ నట్స్ (Walnuts) ను రోజూ తీసుకోవడంతో మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాల్ నట్స్ ఎక్కువ ప్రోటీన్ (Protein) లను కలిగి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరుకు చక్కగా పనిచేస్తాయి. ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మీరు 19శాతం మెమరీ పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.
 

39

చేపలు: చేపల్లో (Fish) ఒమేగా 3 (Omega 3) ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తాయి. చేపలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది.
 

49

చాక్లెట్స్: మెదడును ప్రశాంతంగా ఉంచడానికి డార్క్ చాక్లెట్లు ( Dark Chocolates) ఎక్కువగా సహాయపడతాయి. డార్క్ చాక్లెట్లు తినడంతో మెదడుకు రక్త ప్రవాహాన్ని (Blood flow) మెరుగుపడుతుంది. దాంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది. 
 

59

పుదీనా: పుదీనా టీ (Mint Tea) బ్రెయిన్ పవర్ ని పెంచడానికి సహాయపడుతుంది. తాజా పుదీనా వాసన (Smell) మెదడు పని తీరును పెంచుతుంది. దాంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 

69

అవొకాడో (Avocado): ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు మెదడుకు (Brain) కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచి మెదడు ఆరోగ్యంగా ఉండటంలో ఇది కూడా సహాయపడుతుంది
 

79

గుమ్మడి గింజలు: ఈ గుమ్మడి గింజల్లో (Pumpkin seeds) ట్రప్టోఫోన్ అనే మోనో యాసిడ్స్ (Mono acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది. 
 

89

గుడ్డులో పచ్చసొన: గుడ్డులోని పచ్చసొన (Egg yolk) మంచి పోషక విలువలను కలిగి ఉంటుంది. మెదడు పనితీరుకు కావలసిన పోషకాలను అందించి జ్ఞాపకశక్తిని (Memory) పెంచుతుంది. ఇది బ్రెయిన్ పవర్ ను పెంచడంలో బాగా సహాయపడుతుంది.
 

99

నీళ్ళు: మెదడు యాక్టివ్ గా ఉండాలంటే నీళ్లు (Water) చాలా అవసరం. ఇది శరీర ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని పెంచుతుంది. శరీరం హైడ్రేషన్ (Hydration) లో ఉంచడానికి నీటి అవసరం ఉంది. నీళ్లు తాగడంతో మెదడు ఒత్తిడి తగ్గుతుంది దీంతో మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది.

click me!

Recommended Stories