ముఖంపై వైట్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

First Published Nov 21, 2021, 7:41 PM IST

ప్రస్తుతం ఉన్న కలుషిత వాతావరణం (Polluted atmosphere) కారణంగా అనేక చర్మ సమస్యలు మనకు ఇబ్బందిని కలిగిస్తాయి. గాలిలో ఉండే మలిన పదార్థాలు చర్మపు రంధ్రాలలో చేరి చర్మ సమస్యలకు దారి తీస్తాయి. ఈ విధంగా ముఖం పైన ఏర్పడిన బ్లాక్ హెడ్స్ తో పాటు వైట్ హెడ్స్ కూడా మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. దీంతో ముఖం అందవికారంగా కనిపిస్తుంది. వైట్ హెడ్స్ ముఖం మీద, గడ్డం మీద, ముక్కుమీద, ముక్కు చుట్టూ ఉండి ముఖాన్ని జిడ్డుగా చేస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు (Skin problems) ఇబ్బంది పెట్టడంతో వారు నలుగురిలో కలవడానికి కాస్త ఇబ్బందిగా భావిస్తారు.
 

వైట్ హెడ్స్ ( white Heads) ను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి విసిగి పోతుంటారు. దీని కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయినా తగిన ఫలితం దొరకక నిరాశ  చెందుతారు. అయితే వైట్ హెడ్స్ ను తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అని బ్యూటీషన్లు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం (Article) ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా నాచురల్ పదార్థాలను ఉపయోగించి వైట్ హెడ్స్ ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం..

పంచదార, తేనె స్ర్కబ్: తేనెలో (Honey) కొద్దిగా పంచదార (Sugar) మిక్స్ చేసి ముఖం మీద మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంతో ముఖం మీద ఉండే వైట్ హెడ్స్ వెంటనే తగ్గిపోతాయి. ఈ స్ర్కబ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 

మెంతులు: నానబెట్టిన మెంతులు (Fenugreek)  తీసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో (Water) శుభ్రం చేసుకోవాలి. ఈ స్ర్కబ్ వైట్ హెడ్స్ ను తొలగించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
 

పెసర పిండి స్ర్కబ్: పెసర పిండి (Pesara flour) మిశ్రమంలో కొద్దిగా పాలు (Milk), కొద్దిగా రోజ్ వాటర్ (Rose water) ను మిక్స్ చేసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 

బాదం, పాలు స్ర్కబ్: నానబెట్టి పేస్ట్ చేసుకున్న బాదం (Almonds) మిశ్రమంలో కొన్ని పాలు (Milk) కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసిన అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడంతో వైట్ హెడ్స్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది.
 

బేకింగ్ సోడా: రెండు స్పూన్ ల బేకింగ్ సోడాలో (Baking soda) కొంత నీటిని చేర్చి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వైట్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడంతో వైట్ హెడ్స్ (White heads) సమస్య తొందరగా తగ్గుతుంది.

click me!