అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అనికూడా అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలను చూపించకుండా మనిషి ప్రాణాలను ఇట్టే తీసేయగలదు. ప్రస్తుతం ఈ సమస్య యువతకు కూడా వస్తోంది. రక్త నాళాల గోడలపై రక్తం కలిగించే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలో రక్తపోటు 120/80 మి.మీ గా ఉంటుంది. రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. మందును అతిగా తాగడం, మానసిక ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ చేయడం వంటి కొన్ని కారణాల వల్ల రక్తపోటు బాగా పెరుగుతుంది. ఈ రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఉదయం కొన్ని పనులను చేస్తే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.