మీరు వంకాయ తినరా? ఈ లాభాలను మిస్సైపోతారు మరి ..!

Published : Aug 03, 2023, 03:01 PM IST

కాళ్ల నొప్పులు ఎక్కువవుతాయని చాలా మంది వంకాయ కూరకు దూరంగా ఉంటారు. కానీ వంకాయ ఇలాంటి సమస్యలనేమీ కలిగించదు. నిజానికి దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.   

PREV
16
మీరు వంకాయ తినరా? ఈ లాభాలను మిస్సైపోతారు మరి ..!

వంకాయ ఎన్నో పోషక ప్రయోజనాలను కలిగున్న హెల్తీ కూరగాయ. దీనిలో ఫ్లేవనాయిడ్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయలో పొటాషియం, సోడియం, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

26

వంకాయను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం, విటమిన్ బి 6 పుష్కలంగా ఉండే వంకాయ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 

36

వంకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన గుండె ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.  దీనిలో ఉండే పొటాషియం కంటెంట్ మన రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి కూడా వంకాయ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

46

వంకాయలో ఫినోలిక్ సమ్మేళనాలు, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే.. వంకాయను తింటే మీ ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయన్న మాట. వీటిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే రక్తహీనత సమస్య పోతుంది. 

56

వంకాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు కూడా వంకాయలను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఇవి ఆహారం నుంచి గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

66
brinjal

బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వంకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వంకాయను తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. ఇది మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇకపోతే వంకాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. కాబట్టి పిల్లలకు కూడా వంకాయ కూరలను పెట్టొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories